Overthinking | అధిక ఆలోచనలా..? ఇలా బయటపడండి..!
Overthinking | అతిగా ఆలోచించడమే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా అధిక ఒత్తిడికి లోనైన వ్యక్తులే ఎక్కువగా ఆలోచిస్తుంటారంట. అధిక ఆలోచనల నుంచి బయటపడే మార్గాలు మీ కోసం..
Overthinking | మనం ఏ పని చేయాలన్నా ఎంతో కొంత ఆలోచన చేస్తాం. అయితే, కొందరు మాత్రం ఒకే విషయంపై లోతుగా ఆలోచిస్తుంటారు. మరికొందరు ఆలోచనలతోనే జీవితం గడిపేస్తుంటారు. గతం గురించి ఆలోచించడం, భవిష్యత్ గురించి చింతించడం వంటి వాటితో చాలా మంది గడిపేస్తుంటారు. ఏ పనికైనా ఆలోచన అవసరమే. అయితే, అతిగా ఆలోచించడమే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా అధిక ఒత్తిడికి లోనైన వ్యక్తులే ఎక్కువగా ఆలోచిస్తుంటారంట. అధిక ఆలోచనల నుంచి బయటపడే మార్గాలు మీ కోసం..
ఆలోచనలు మన జీవితాన్ని ఆక్రమిస్తున్నాయని మీరెప్పుడైనా భావించారా? లోతుగా పదే పదే ఆలోచించడం, అతిగా ఆలోచించే అలవాటును నియంత్రించుకోవడం చాలా మంచిదని సెలవిస్తున్నారు నిపుణులు. లేనట్లయితే అది అలవాటుగా మారి చివరకు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి శారీరక ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అతిగా ఆలోచించడం వల్ల ఆరోగ్య సమస్యలు..
- అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది.
- మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తుంది.
- స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు.
- ఆల్కహాల్ డ్రింకింగ్, సిగరెట్ స్మోకింగ్ అలవడుతుంది.
- రాత్రంతా మేల్కోనేలా చేసి నిద్ర సమస్యలు తలెత్తుతాయి.
- నిద్ర లేని కారణంగా అలసటకు గురవుతారు.
- ఆకలిని అణిచి వేస్తుంది. లేదంటే అతిగా తింటారు.
- జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
- మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- వ్యాధి నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.
బయటపడేందుకు ‘54321’ టెక్నిక్
1. మీరు చూడగలిగే ఐదు అంశాలను లెక్కించడానికి ముందు మీ చుట్టూ ఉన్న 5 వస్తువులను చూడండి. వాటిని గుర్తించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. మీ శరీరాన్ని మీ భావనలను వాటిని గమనించడానికి, వాటిపై మనస్సు నిమగ్నం చేయడానికి ఇది మొదటి మార్గం.
2. తదుపరి దశలో మీరు తాకగల 4 విషయాలు గుర్తించండి. మీరు ధరించిన వస్త్రాలను తాకండి. మీ చర్మం యొక్క మృధువైన ఆకృతిని స్పృషించండి. మీ పాదాలను నేలపై ఉంచి అనుభూతిని పొందండి. వీటిని తాకడానికి, అనుభూతి చెందడానికి వాటితో కనీసం ఒక నిమిషం పాటు గడపండి. ఆ తర్వాతే వాటి గురించి ఆలోచించడం ప్రారంభించండి.
3. మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి. నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూర్చున్నప్పుడు కూడా మీరు మంద్రమైన శబ్దాలు వినొచ్చు. ఇది సుదూర ట్రాఫిక్ లేదా పక్క గదిలోని స్వరాలు కావచ్చు. వాటి గురించి చెప్పుకోవడం కన్నా మీరు వినగలిగే ఆ 3 విషయాలపై దృష్టి పెట్టండి.
4. వాసన గ్రహించే 2 విషయాలను గమనించండి. మీరు మీ పరిసరాల్లో ఉండే వాసనలను పసిగట్టి 2 విషయాలను కనుగొనడానికి ప్రయత్నించండి. ఆ రెండు విషయాలపై శ్రద్ధ పెట్టాలంటే మీరు లేచి వాటి కోసం వెతకాలి. అది బెడ్ షీట్ లేదా పెన్ను కావచ్చు. మీ చుట్టూ ఉన్న గాలి లేదా మీ స్వంత చర్మం సూక్ష్మ సువాసనను కూడా మీరు గ్రహించవచ్చు.
5. మీరు రుచి చూడగలిగే 1 విషయం గురించి తెలుసుకోండి. మీ నోటిలో ఏదైన ఒక పదార్ధం రుచి ఎల్లప్పుడూ ఉంటుంది. కాఫీ లేదా చాక్లెట్ రుచి నాలుకపై చాలా సేపటి వరకు ఉంటుంది. దానిపై శ్రద్ధ వహించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా అనవసర ఆలోచనల నుంచి మనం బయటపడొచ్చు. ఒకే విషయంపై ఎక్కువగా ఆలోచించే ప్రయాస నుంచి దూరం కావొచ్చు.
ఇవీ సహకరిస్తాయి..
అతిగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే దాని నుంచి బయటపడేందుకు ఏదో ఒక పనిని ఎంచుకోవాలి. ప్రతికూల ఆలోచనల నుంచి మన మనస్సును మరల్చడానికి ఇష్టమైన సంగీతాన్ని వినాలి. డైరీని ముందేసుకుని మీరు ఏం ఆలోచిస్తున్నారో రాసుకోవాలి. మీ భయాన్ని, చింతలను సన్నిహిత వ్యక్తులతో పంచుకోవాలి. గత విషయాల గురించి ఆలోచించటం మానుకుని భవిష్యత్ వైపు అడుగులేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయమాలు ప్రయత్నించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

