సీజన్ ప్రభావం కావచ్చు. ఇంకేదైనా కారణం కావచ్చు. ఎక్కడ చూసినా ‘దగ్గు’ల మోతే. కానీ చాలామంది దగ్గును, గొంతునొప్పిని లెక్కలోకి తీసుకోవడం లేదు. సమస్య మొదలైనప్పుడే సరైన పత్యం చెయ్యకుండా.. ఇష్టమొచ్చినట్టు తింటూ తీరా నొప్పి ముదిరాక వైద్యులను సంప్రదిస్తున్నారు. దీనివల్ల సమస్య మరింత తీవ్రం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.