Health Tips | ప్రొటీన్‌తో అధిక బరువుకు చెక్
అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయామాలు, ఉపవాసాలతో పాటు ఎన్నింటినో పాటిస్తుంటారు. బరువు తగ్గే ప్రక్రియ (Health Tips) కొందరికి కొన్ని వారాల్లో ఫలితాలనిస్తే మరికొందరికి నెలల తరబడి ప్రయత్నించినా ఫలితం అంతంత మాత్రమే.
న్యూఢిల్లీ : అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయామాలు, ఉపవాసాలతో పాటు ఎన్నింటినో పాటిస్తుంటారు. బరువు తగ్గే ప్రక్రియ (Health Tips) కొందరికి కొన్ని వారాల్లో ఫలితాలనిస్తే మరికొందరికి నెలల తరబడి ప్రయత్నించినా ఫలితం అంతంత మాత్రమే. వయసు, వ్యక్తుల శరీరతత్వాల ఆధారంగానూ భిన్న ఫలితాలు కనిపిస్తుంటాయి. ఇక వర్కవుట్లతో పాటు బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారం కూడా కీలకమని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియ గాడినపడుతుంది. సూక్ష్మపోషకాలు అందకుంటే విటమిన్ల లోపం తలెత్తి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. బరువు తగ్గడంలో అత్యంత చురుకైన మ్యాక్రో న్యూట్రియంట్ ప్రొటీన్ అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. శరీర పనితీరుకు, జీవ క్రియల వేగం పుంజుకునేందుకు ప్రొటీన్ తప్పనిసరి. కండరాలు, ఎముకలు, చర్మం, వెంట్రుకలు, కణజాలం సహా శరీర పనితీరుకు ప్రొటీన్ అవసరమని ఇది శరీరంలో కెమికల్ రియాక్షన్స్, రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందని హార్వర్డ్ స్కూల్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది.
శరీరం సరైన పనితీరు కనబరచాలంటే ప్రొటీన్ అత్యవసరమని, ఆహారంలో తప్పకుండా ప్రొటీన్‌ను భాగం చేసుకోవాలని, ఇది బరువు తగ్గడంలోనూ ఉపకరిస్తుందని ప్రముఖ డైటీషియన్ ప్రతిక్ష కదం చెబుతున్నారు. శరీర బరువులో ప్రతి గ్రాముకు 0.8 గ్రాముల ప్రొటీన్ మనిషికి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Read More
Beauty Tips | టీ ఎక్కువగా తాగితే నల్లబడతారా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

