‘హైపర్’ సమస్య
దేశంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చాలామందే కనిపిస్తారు. సీతాకోక చిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉండే గ్రంథి పేరే.. థైరాయిడ్. ఇది తగిన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్‌ను స్రవించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి మరీ చురుగ్గా ఉంటే.. ఎక్కువ హార్మోన్‌ను స్రవిస్తుంది.
దేశంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చాలామందే కనిపిస్తారు. సీతాకోక చిలుక
ఆకారంలో గొంతు భాగంలో ఉండే గ్రంథి పేరే.. థైరాయిడ్. ఇది తగిన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్‌ను స్రవించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి మరీ చురుగ్గా ఉంటే.. ఎక్కువ హార్మోన్‌ను స్రవిస్తుంది. హైపర్ థైరాయిడిజం అంటే ఇదే. ఈ పరిస్థితి జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అలా శరీర విధుల మీద కూడా ప్రభావం చూపుతుంది.
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తేనే అన్ని శరీర విధులూ సక్రమంగా జరుగుతాయి. అయితే, మనదేశంలో థైరాయిడ్ రుగ్మతల గురించి అవగాహన తక్కువ. అందులోనూ, హైపర్ థైరాయిడిజం లాంటి థైరాయిడ్ రుగ్మతల పట్ల జాగ్రత్తగా ఉంటూ.. సమస్యను తొలిదశలోనే గుర్తించి, తగిన పరీక్షలు చేయించుకుని.. నిర్ధారించు కోవడం చాలా ముఖ్యమని గుర్తించాలి. మహిళలతోపాటు టైప్-1 డయాబెటిస్, థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నవారి కుటుంబసభ్యులకూ హైపర్ థైరాయిడిజం ముప్పు ఎక్కువ.
ఆలస్యం వద్దు
బరువు తగ్గడం, వణుకు (ట్రెమర్స్), గుండె అదరడం, చెమటలు ఎక్కువగా పట్టడం, ఓ మోస్తరు వేడికి కూడా తట్టుకోలేకపోవడం, తరచూ మల విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఆకలి పెరగడం, మహిళల్లో నెలసరి మార్పులు హైపర్ థైరాయిడిజం లక్షణాల్లో కొన్ని. కొంతమందిలో కండ్ల సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోతుంది కూడా. ఇందులో చాలావరకూ నిత్య జీవితంలో ఎదురయ్యేవే కావడంతో చాలామంది సమస్యను తేలిగ్గా తీసుకుంటారు. ఫలితంగా రోగ నిర్ధారణ, చికిత్స ఆలస్యం అవుతుంది.
పరీక్షలు ముఖ్యం..
అదే తగిన అవగాహన ఉంటే… థైరాయిడ్ పరీక్షలు, నిర్ధారణ, చికిత్స కోసం సమస్య ఆరంభంలోనే వైద్యులను సంప్రదిస్తారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్), టీ4, టీ3, టీఎస్‌హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్ లాంటివి థైరాయిడ్ సమస్యలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు. మరింత కచ్చితమైన నిర్ధారణ కోసం వైద్యులు న్యూక్లియర్ థైరాయిడ్ స్కానింగ్ కూడా సిఫారసు చేస్తారు. హైపర్
థైరాయిడిజంను తొలిదశలోనే అదుపు చేయడానికి, మున్ముందు మరిన్ని ఆరోగ్య సమస్యలు
తలెత్తకుండా ఉండటానికి.. సరైన సమయంలో కచ్చితమైన నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స
అవసరం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏ చిన్న రోగ లక్షణాన్నీ విస్మరించవద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

