Chai | చాయ్ వల్ల చురుకుదనం కలిగినా.. సమస్యలూ ఉన్నాయ్
బ్రిటిష్ పాలకులు అలవాటు చేసిన పానీయం తేనీరు. తెల్లవారిని తరిమికొట్టినా, చాయ్‌ని మాత్రం వదులు కోలేకపోతున్నాం. ఉదయాన్నే ఓ కప్పు పడందే చాలామందికి దినచర్య మొదలు కాదు. టీలోని కెఫిన్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల చురుకుదనం కలిగినా.. బ్రిటిష్ పాలకులు అలవాటు చేసిన పానీయం తేనీరు.
బ్రిటిష్ పాలకులు అలవాటు చేసిన పానీయం తేనీరు. తెల్లవారిని తరిమికొట్టినా, చాయ్‌ని మాత్రం వదులు కోలేకపోతున్నాం. ఉదయాన్నే ఓ కప్పు పడందే చాలామందికి దినచర్య మొదలు కాదు. టీలోని కెఫిన్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల చురుకుదనం కలిగినా.. కొన్ని సమస్యలంటూ ఉంటాయి..
- ఖాళీ కడుపుతో చాయ్ తాగితే.. ఆ ద్రవ పదార్థం పొట్టలో ఆమ్ల (ఎసిడిక్), క్షార (ఆల్కలిన్) రసాయనాల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది.
- టీకి డైయురెటిక్ లక్షణం ఉంది. అంటే, మూత్రం వచ్చే అవకాశం ఎక్కువ. అసలే రాత్రంతా డీహైడ్రేట్ అయిన శరీరం, టీ తాగాక మరింత తేమను కోల్పోవచ్చు. దీనివల్ల కండరాలు పట్టేయవచ్చు. అలా క్రాంప్స్‌కు దారితీస్తుంది.
- టీ అంటే మూడొంతులు పాలే! పాలలోని లాక్టోజ్ అంత తేలికగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపుబ్బరం,
మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. - వేడివేడిగా తాగితే పంటి పైపొర దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.
- టీలోని కెఫిన్ ఖాళీ కడుపులోకి చేరడం వల్ల కళ్లు తిరగడం, వికారం లాంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. అందుకే ఉదయం అల్పాహారం తీసు కున్నాకో, కనీసం మంచినీళ్లు తాగిన తర్వాతో చాయ్ కప్పు అందుకోవడం మంచిదని సలహా ఇస్తారు నిపుణులు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Antioxidants
- British Rule
- Chai
- tea
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

