Guava | రోజుకు ఒక జామకాయను తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
జామకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అయితే జామకాయలు ఇప్పుడు మనకు ఏడాది పొడవునా లభిస్తున్నాయి. కానీ సీజనల్‌గా లభించే లోకల్ జామ కాయలను తింటేనే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది.
Guava | జామకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అయితే జామకాయలు ఇప్పుడు మనకు ఏడాది పొడవునా లభిస్తున్నాయి. కానీ సీజనల్‌గా లభించే లోకల్ జామ కాయలను తింటేనే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. జామకాయలు లేదా పండ్లలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉంటాయి. జామకాయల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. జామకాయను కనీసం రోజుకు ఒకటి అయినా తినాలి. ముఖ్యంగా ఈ సీజన్లో జామకాయలను తినడం వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జామకాయలను కచ్చితంగా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో చెప్పలేనన్ని లాభాలను పొందవచ్చు.
విటమిన్ సి..
జామకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ జామకాయను తింటే మనకు సుమారుగా 228 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. కామన్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం అందిస్తుంది. జామకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక జామకాయను రోజుకు ఒకటి కచ్చితంగా తినాలి.
డయాబెటిస్..
డయాబెటిస్ ఉన్నవారికి జామకాయలు చేసే మేలు అంతా ఇంతా కదు. ఈ కాయలు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. పైగా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కనుక ఈ కాయలను తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు జామకాయలను తమ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. జామకాయల్లో కాపర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మన శరీరం హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. థైరాయిడ్ ఉన్నవారు జామకాయలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. థైరాయిడ్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీంతో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.
జీర్ణక్రియకు..
జీర్ణక్రియను మెరుగు పరచడంలో జామకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది విరేచనం సరిగ్గా అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే జామ ఆకులతో తయారు చేసిన నీళ్లను సేవించడం వల్ల విరేచనాల నుంచి బయట పడవచ్చు. జామకాయల్లో మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది కండరాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
జామకాయల్లో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. దీన్నే పైరిడాక్సిన్ అంటారు. అలాగే విటమిన్ బి3 కూడా ఉంటుంది. దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. ఈ రెండు రకాల విటమిన్లు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మైండ్ షార్ప్‌గా పనిచేస్తుంది. ఇలా జామకాయలను తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Guava
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

