Cluster Beans | గోరు చిక్కుడును లైట్ తీసుకోకండి.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మనం రోజూ అనేక కూరగాయలను తింటుంటాం. మాంసాహారం కన్నా శాకాహారం తింటేనే ఎక్కువ కాలం జీవించవచ్చని సైంటిస్టుల అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అందుకనే చాలా మంది మాంసాహారం వదిలి శాకాహారులుగా మారిపోతున్నారు.
Cluster Beans | మనం రోజూ అనేక కూరగాయలను తింటుంటాం. మాంసాహారం కన్నా శాకాహారం తింటేనే ఎక్కువ కాలం జీవించవచ్చని సైంటిస్టుల అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అందుకనే చాలా మంది మాంసాహారం వదిలి శాకాహారులుగా మారిపోతున్నారు. అయితే మనకు అందుబాటులో ఉన్న కూరగాయలను తింటే భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొన్ని రకాల కూరగాయలను చాలా మంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారు. వాస్తవానికి అలాంటి కూరగాయల్లోనే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. వీటిని ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే గోరు చిక్కుడు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. గోరు చిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు.
పోషణ, శక్తి..
గోరుచిక్కుడులో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువగానే లభిస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తరచూ గోరు చిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. గోరు చిక్కుడులో ప్రోటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్లు ఎ, సి, కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. గోరు చిక్కుడును తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను పొందవచ్చు. దీంతో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది.
రక్తం గడ్డ కట్టదు..
రక్తంలో చిక్కదనం పెరిగితే రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. ఈ పరిస్థితిని డీప్ వీన్ త్రాంబోసిస్ (డీవీటీ) అంటారు. అయితే ఈ సమస్య ఉన్నవారికి గుండె పోటు వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ గోరు చిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది. ఇది రక్తం పలుచగా అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే రక్త నాళాల్లోని కొవ్వును కరిగించడంలోనూ గోరు చిక్కుడు అద్భుతంగా పనిచేస్తుంది. కనుక వీటిని తరచూ తింటుండాలి. ఇక వీటిని తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ సుఖ విరేచనం అవుతుంది.
కొలెస్ట్రాల్, షుగర్‌కు చెక్..
గోరు చిక్కుడులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో అజీర్తి నుంచి బయట పడవచ్చు. అలాగే గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. వీటిని తింటే గర్భిణీలకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. దీంతో శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. పుట్టుక లోపాలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే గోరు చిక్కుడును తింటే కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా గుండెను రక్షించుకోవచ్చు. గోరు చిక్కుడులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు తరచూ వీటిని తింటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఇలా గోరు చిక్కుడుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని తరచూ తప్పక తింటుండాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- cluster beans
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

