హస్త ప్రయోగం చేసుకుంటుండగా.. దెబ్బతిన్న ఊపిరితిత్తులు
ఓ 20 ఏండ్ల యువకుడు హస్త ప్రయోగం చేసుకుంటుండగా.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఆస్పత్రి పాలయ్యాడు ఆ యువకుడు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని రేడియాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.
స్విట్జర్లాండ్‌కు చెందిన యువకుడు(20) ఇంట్లోనే బెడ్‌పై పడుకుని హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు సంభవించాయి. దీంతో హుటాహుటిన బాధిత యువకుడు ఆస్పత్రికి వెళ్లాడు.
వైద్యులు అతన్ని పరీక్షించగా.. అప్పటికే అతని ముఖం వాచిపోయింది. శ్వాస తీసుకున్నప్పుడల్లా ఊపిరితిత్తుల్లో శబ్దాలు రావడాన్ని గమనించారు. ఎక్స్ రే తీయగా న్యుమోమెడియాస్టినమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే తరుచుగా హస్త ప్రయోగం చేయడం వల్ల.. ఆ ప్రభావం ఊపిరితిత్తులపై పడినట్లు వైద్యులు పేర్కొన్నారు. గాలి గట్టిగా తీసుకోవడం ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. దీంతో ఊపిరితిత్తుల్లో నుంచి గాలి లీక్ కావడం వల్ల, బలంగా శ్వాస తీసుకున్నప్పుడల్లా శబ్దాలు వస్తున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి తోడు బాధిత యువకుడికి ఆస్తమా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఊపిరితిత్తులు దెబ్బతిన్న కారణంగా బాధితుడికి హైడోస్ ఆక్సిజన్ అందించారు. ఛాతీ నొప్పికి యాంటీబయోటిక్స్ ఇచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజుల అనంతరం ఆ యువకుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 20 ఏండ్ల వయసు ఉన్న యువకులు హస్త ప్రయోగం చేసే సమయంలో చాలా అరుదుగా ఇలాంటి సమస్య తలెత్తుందని వైద్యులు చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

