ఆరోగ్యానికి కిస్సింగ్ మంత్ర : ఇక గాఢ చుంబనంతో చెలరేగండి..!
రోజూ భాగస్వామిని ముద్దులతో ముంచెత్తితే దాంపత్య బంధం బలోపేతం కావడంతో పాటు శారీరక రుగ్మతలకూ దూరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : నిత్యం గాఢ చుంబనంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ భాగస్వామిని ముద్దులతో ముంచెత్తితే దాంపత్య బంధం బలోపేతం కావడంతో పాటు శారీరక రుగ్మతలకూ దూరం కావచ్చని చెబుతున్నారు. చుంబనంతో పలు ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయని, దంతాల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.
గాఢమైన చుంబనంతో విడుదలయ్యే సలివాతో పళ్లు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. కిస్ చేసుకోవడంతో నోటిలోని సలివా భాగస్వాముల్లోకి చేరుతుందని, అయితే నోటి బ్యాక్టీరియా ఎప్పుడూ చెడుగానే ఉండదని అంటున్నారు. సలీవాలోని కొన్ని ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియాల వృద్ధిని తగ్గిస్తాయని దీంతో దంతక్షయం ముప్పును నివారించవచ్చన్నది నిపుణుల మాట. ఆరోగ్యకర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో శరీరం పోరాడే శక్తిని పెంచడంతో చుంబనం ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్పుకొచ్చారు.
నోటి పరిశుభ్రత కారణంగా హృద్రోగ ముప్పు తగ్గడం సహా పలు ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయని నిపుణులు గుర్తుచేశారు. ప్రమాదకర ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీలను తయారుచేయడాన్ని చుంబనం ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. నోటి పరిశుభ్రతను కాపాడుకునేందుకు బ్రష్ చేసుకోవడం, ఫ్లాసింగ్తో పాటు రోజుకు నాలుగు నిమిషాలు భాగస్వాములు చుంబనంలో మునిగితేలాలని ఓ డెంటిస్ట్ సిఫార్సు చేశారు.
పళ్లపై ఉండే ఆమ్లాలను తటస్ధీకరించడంలో సలివా ఉపకరిస్తుందని, దీంతో దంతక్షయం ముప్పు తగ్గుతుందని వెల్లడించారు. దంతాలపై పేరుకుపోయిన వ్యర్ధాలను కూడా ఇది తొలగిస్తుందని చెప్పారు. కిస్సింగ్ ఎండార్ఫిన్లను ప్రేరేపించడంతో పాటు ఆరోగ్యకరమైన దంతాలకు, చక్కగా శ్వాసించేందుకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలకూ ఉపకరిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

