సన్నసన్నగా.. పెన్సిల్తో గీసినంత తీరుగా కనుబొమల్ని తీర్చిదిద్దుకునేవారు అమ్మాయిలు. కానీ దట్టమైన కనుబొమలే.. లేటెస్ట్ ట్రెండ్. సౌందర్యరాశి రశ్మిక మందన్న మొదలు చాలామంది తారలు ఫ్లఫ్పీ బ్రోస్నే ఇష్టపడుతున్నారు. కనుబొమలు ఏపుగా పెరగడానికి కొన్ని చిట్కాలున్నాయి.
ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు అపారం. ఇయర్బడ్ను ఈ నూనెలో ముంచి.. కనుబొమల మీద సుతారంగా రుద్దితే చాలు.
విటమిన్లు, పోషకాలు అధికం. కొనవేలితో రాసుకుని.. కాసేపటి తర్వాత వెచ్చని నీళ్లతో కడగాలి.
ఇందులోని ప్రొటీన్స్, బయోటిన్ కేశాల పెరుగుదలను ఎంతగానో ప్రోత్సహిస్తాయి.
కనుబొమలు పొడిబార కుండా కాపాడుతుంది. కేశాల పెరుగుదలకు సహకరిస్తుంది.
ఇప్పటికే ఉల్లితో తయారైన కేశ తైలాలు మార్కెట్లో రాజ్యం ఏలుతున్నాయి. ఇదే సూత్రం కనుబొమలకూ వర్తిస్తుంది.
.. మసాజ్ ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది. కనుబొమల మొదళ్లు బలపడతాయి. కాబట్టి, వేలి కొనలతో తరచూ మర్దన చేసుకోవడం ద్వారా కూడా కనుబొమలను బలోపేతం చేసుకోవచ్చు.