న్యూఢిల్లీ : బొప్పాయితో గుండెకు మేలు కలగడం నుంచి జీర్ణక్రియ సాఫీగా సాగడం వరకూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఈ పండులో ఉండటంతో చాలా మంది బొప్పాయిని తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. బొప్పాయితో ఆరోగ్యమే కాదు మేని మెరుపులూ సొంతమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
పపాయ సోప్‌తో ఆరోగ్యవంతమైన కాంతులీనే చర్మం సొంతమవుతుంది. పపాయ సోప్‌లో విటమిన్ సీ ఎక్కువగా ఉండటంతో ఇది చర్మంలో కొలాజెన్ తయారయ్యేందుకు దారితీస్తుంది. చర్మం పునరుత్తేజం కావడంతో పాటు శరీరంలోని మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పపాయలో ఉండే పపైన్ చర్మంపై పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగిస్తుంది. చర్మం పైభాగంలో ఉండే మృత కణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పపాయా సోప్ శరీరంపై డార్క్ స్పాట్స్‌ను కూడా తొలగిస్తుంది.