Fish Eggs: చేపలే కాదు, చేపల గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఎక్కువమంది మార్కెట్లో చేపలను ముక్కలుగా కట్ చేయిస్తారు. ఆ సమయంలో చేపల్లో గుడ్లు వస్తే పడవేయమంటారు. మీరూ కూడా గతంలో అలాగే చేసి ఉండవచ్చు. కానీ చేప గుడ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే మాత్రం.. ఇక ముందు ఆ పనిచేయరు. కచ్చితంగా చేప గుడ్లను ఇంటికి తీసుకెళ్తారు.