మాట్లాడకపోతే ఆటిజమా?
మా బాబుకు మూడేండ్లు. స్పష్టంగా మాట్లాడలేడు. అన్నిసార్లూ మనం చెప్పింది అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకున్నా పెద్దగా స్పందన ఉండదు. ఇవి ఆటిజం లక్షణాలని అంటున్నారు. మాకు భయంగా ఉంది. ఏ వైద్యులను సంప్రదిస్తే మంచిది?
మా బాబుకు మూడేండ్లు. స్పష్టంగా మాట్లాడలేడు. అన్నిసార్లూ మనం చెప్పింది అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకున్నా పెద్దగా స్పందన ఉండదు. ఇవి ఆటిజం లక్షణాలని అంటున్నారు. మాకు భయంగా ఉంది. ఏ వైద్యులను సంప్రదిస్తే మంచిది?
– ఓ పాఠకురాలు
బాబుకు మూడేండ్లు నిండాయని చెప్పారు. ఆ ప్రకారంగా, తను ఇప్పటికే గడగడా మాట్లాడుతూ ఉండాలి. మాటలు రావడం అనేది మూడు కోణాల్లో ఉంటుంది. మీ మాటల్ని వినడం, విన్నది అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నదానికి స్పందించడం. ఈ మూడు ప్రక్రియలూ సజావుగా సాగితేనే.. బిడ్డకు పరిపూర్ణంగా వినికిడి శక్తి ఉన్నట్టు. ఈ విషయంలో లోపాలుంటే.. పీడియాట్రీషియన్‌ను సంప్రదించండి. బిడ్డ మాట్లాడలేకపోవడానికి ఓ కారణం.. వినలేకపోవడం. తనకు వినికిడి పరీక్షలు చేయించారా? మాటలు నేర్చుకునే క్రమంలో బిడ్డ.. తొలి ఏడాది వరకూ కొన్ని పదాలు పలకడం మొదలుపెడుతుంది.
రెండో ఏడాది ఆ పదాలను కలప
గలుగుతుంది. మూడేండ్లకు పూర్తి స్థాయిలో సంభాషణ కొనసాగిస్తుంది. కొందరిలో ఈ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అర్థమైనా కూడా మాట్లాడలేకపోతే.. ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం. పుట్టిన ప్రతిబిడ్డకూ వినికిడి పరీక్ష చేయించడం ఉత్తమం. ప్రతి నాలుగువేలమందిలో ఒకరు చెవుడుతో పుడతారని అంచనా. తొలిదశలోనే గుర్తించగలిగితే..
చెవుడు-మూగ
సమస్య అధిగమించవచ్చు. మరొక విషయం.. ఆటిజంలో వినికిడి సమస్య ఉండదు. పిల్లల సామాజిక ప్రవర్తనలో మాత్రం తేడా ఉంటుంది. నలుగురిలో కలవలేరు. తమలో తాము మాట్లాడుకుంటారు. బిడ్డను ప్రత్యక్షంగా చూసి, సమస్య బేరీజు వేశాకే ఆటిజమా, కాదా అన్నది నిర్ధారించవచ్చు. తగిన సలహా కోసం డెవలప్మెంటల్ పీడియాట్రీషియన్‌ను కలవడం ఉత్తమం. వారిద్వారా బిడ్డ పరిస్థితిని బేరీజు వేయించాలి. మీ బాబు స్క్రీన్ టైమ్ గురించి చెప్పలేదు. కొవిడ్ తర్వాత.. పిల్లలు ట్యాబ్, టీవీ, స్మార్ట్ఫోన్లకు బానిసలు అవుతున్నారు. సామాజిక ప్రవర్తనలో తేడా వస్తున్నది. దీనివల్ల కూడా ఆటిజం లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

