High BP | హైబీపీని తగ్గించే కొత్త ఔషధం.. భిన్న విధానంలో పనితీరు..
హై బ్లడ్ ప్రెషర్ (హైపర్‌టెన్షన్) ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య. మారిన జీవన విధానమే ఈ సమస్యకు ప్రధాన కారణం. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది.హై బ్లడ్ ప్రెషర్ కారణంగా రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
High BP | హై బ్లడ్ ప్రెషర్ (హైపర్‌టెన్షన్) ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య. మారిన జీవన విధానమే ఈ సమస్యకు ప్రధాన కారణం. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది.హై బ్లడ్ ప్రెషర్ కారణంగా రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. సాధారణంగా మందులు, జీవనశైలి మార్పులు ద్వారా దీనిని నియంత్రించగలిగినా, కొంతమందిలో మాత్రం ఈ చికిత్సలు సరైన ఫలితాలు ఇవ్వవు. అలాంటి పరిస్థితుల్లో కొత్త చికిత్సలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు baxdrostat అనే కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇతర మందులు పనిచేయని రోగుల్లో కూడా ఇది రక్తపోటును తగ్గించే సామర్థ్యం చూపిస్తూ ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ట్యాబ్లెట్ శరీరంలో ఉప్పు, నీటి నిల్వను పెంచే ముఖ్యమైన హార్మోన్‌పై ప్రభావం చూపి రక్తపోటును నియంత్రిస్తుంది.
రోగుల్లో తగ్గిన బీపీ..
ఈ ఔషధంపై నిర్వహించిన BaxHTN అనే విస్తృత స్థాయి పరీక్షలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది రోగులను పరీక్షించారు. 12 వారాల పాటు రోజుకు 1 mg లేదా 2 mg తీసుకున్న రోగుల్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (పైన సంఖ్య) సుమారు 9-10 mmHg వరకు తగ్గినట్లు గుర్తించారు. దాదాపు 40 శాతం మంది రోగులు లక్ష్య స్థాయి (130/80 mmHg కంటే తక్కువ) చేరుకోగలిగారు, ఇది ప్లాసీబో గ్రూప్‌తో పోలిస్తే గణనీయమైన పురోగతని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరొక Bax24 ట్రయల్‌లో 24 గంటల బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్‌లో ఇంకా ఎక్కువ ప్రభావం కనిపించింది. ఈ పరీక్షలో సుమారు 14 mmHg వరకు తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా, ఈ ప్రభావం 32 వారాల వరకు కొనసాగినట్లు, పెద్దగా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.
పనితీరు ఇలా..
ఈ ఔషధం పనిచేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది అడ్రినల్ గ్రంథుల్లో తయారయ్యే ఆల్డోస్టెరోన్ అనే హార్మోన్‌ను నియంత్రించే ఎంజైమ్‌ను నిరోధిస్తుంది. ఆల్డోస్టెరోన్ ఎక్కువగా ఉంటే కిడ్నీలు ఉప్పు, నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి, దాంతో రక్తపోటు పెరుగుతుంది. baxdrostat ఈ ప్రక్రియను నియంత్రించి రక్తపోటును తగ్గిస్తుంది. పరిశోధకుల ప్రకారం, సుమారు 10 mmHg వరకు రక్తపోటు తగ్గడం గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా నియంత్రణలో లేని హైపర్‌టెన్షన్ ఉన్న రోగులకు ఇది కీలక పరిష్కారంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హై బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఇబ్బందులు పడుతున్న రోగులకు ఈ కొత్త ఔషధం భవిష్యత్తులో ముఖ్యమైన మార్గంగా మారే అవకాశముంది. అయితే ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా వైద్యుల పర్యవేక్షణలో మరిన్ని అధ్యయనాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- High BP
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

