Health Tips | ఇక మెరుపులే.. : ఈ ఆహారంతో మీ వయసు ఓ పదేండ్లు తగ్గుతుంది!

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం ఎలా మారుతుందనేది జన్యుపరమైన అంశాలపై ఆధారపడినా కొన్ని అలవాట్లు, ఆహారం కూడా ఆరోగ్యంపై, యవ్వనంగా కనిపించడంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మద్యం, స్మోకింగ్ వంటి అలవాట్లతో వృద్ధాప్య ఛాయలను ముందుగానే తీసుకువస్తాయి. మన ఆహారపు అలవాట్లతో మన వయసును ఓ పదేండ్లు తగ్గినట్టు కనిపించేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టిప్స్‌తో చర్మ సౌందర్యాన్నీ మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తున్నారు. కూరలు, సలాడ్స్‌లో కమ్మని రుచిని ఇచ్చే టమాటతో ఆరోగ్యం, నిత్య యవ్వనం సొంతమని పరిశోధకులు తేల్చారు. టమాటలో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అల్ట్రావయలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
ఆలివ్ ఆయిల్లో వండిన టమాటాను రోజుకు రెండు ఔన్సులు తీసుకుంటే సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు మేని మెరుపులకు మేలుచేస్తుంది. ఆరోగ్యకర చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడటం, మెరిసే జుట్టు కోసం రోజూ ఫ్యాటీ ఫిష్‌ను తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ చేపలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మంలో వాపు ప్రక్రియను నివారిస్తుంది. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో చేసిన వంటకాలను తినడం శరీరానికి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఈ నూనెలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆలివ్ ఆయిల్‌తో వండిన వంటలను ఆరగిస్తే చర్మ సౌందర్యం మెరుగవడంతో పాటు వయసు మళ్లే ప్రక్రియను మందగించేలా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక రోజూ ఐదు ఎండు ద్రాక్షలను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా ఎముకలు, కండరాల పటుత్వం బలోపేతమవుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. వీటిని తరచూ తీసుకుంటే శరీర సౌష్టవం మెరుగై యవ్వనంగా కనిపిస్తారు. యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ కే పుష్కలంగా ఉండే ఎండు ద్రాక్షలను రోజూ ఐదు చొప్పున తీసుకుంటే ఎముక పుష్టి కలుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

