ఎముకల్లో లోపం.. ఎదుగుదలకు శాపం!
పిల్లలు పెరిగే సమయంలో కనిపించే సాధారణ ఆర్థోపెడిక్ (ఎముకల) సమస్యలు ఏమిటి? ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్రమైన అంచనాలతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో రోగ నిర్ధారణ చేస్తాం.
పిల్లలు పెరిగే సమయంలో కనిపించే సాధారణ ఆర్థోపెడిక్ (ఎముకల) సమస్యలు ఏమిటి?
ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్రమైన అంచనాలతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో రోగ నిర్ధారణ చేస్తాం. అత్యాధునిక చికిత్స అందిస్తాం. ఆర్థోపెడిక్ సమస్యలైన విల్లు కాళ్లు (కాళ్ల ఎముకలు ధనుస్సు ఆకారంలో వంగిపోవడం), వంకర మోకాళ్లు, కాలి నడకలో చదునైన పాదాలు వంటి సమస్యలు పిల్లల్లో సర్వసాధారణం. అయితే వీటిలో కొన్ని సమస్యలు పిల్లలు పెరిగేకొద్దీ తగ్గిపోతాయి. కానీ, కొన్ని సమస్యలకు చికిత్స తీసుకోవాల్సిందే. పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ అవసరం. పైన పేర్కొన్న సమస్యలు పిల్లల్లో గుర్తిస్తే.. అవి తగ్గుముఖం పడుతున్నాయా? లేదా పెరుగుతున్నాయా? అనే విషయాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనించాలి. ఒకవేళ సమస్య ఎక్కువ అవుతున్నట్టు అనిపించినా లేదా తగ్గుతున్నట్టు అనిపించకపోయినా.. సకాలంలో రోగ నిర్ధారణతోపాటు చికిత్స కోసం పీడియాట్రిక్ ఆర్థోపెడీ షియన్ను సంప్రదించాలి.
పిల్లల్లో వంకర మోకాలు, విల్లు కాళ్లు అంటే ఏమిటి?
వంకర మోకాలు (genu valgum) అంటే.. పిల్లలు నిటారుగా నిలబడి, మోకాళ్లు తాకినప్పుడు.. చీలమండలు వేరుగా ఉంటాయి. విల్లు కాళ్లు (genu varum) అంటే.. పిల్లల కాలి వేళ్లు ముందుకు చూపినప్పుడు, వారి చీలమండలు తాకినా.. వారి మోకాళ్లు వేరుగా ఉంటాయి.
వంకర మోకాలు, విల్లు కాళ్లు సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి?
పుట్టుకతో వచ్చే శారీరక సమస్యలు l రికెట్స్ (విటమిన్ డి, క్యాల్షియం లోపం, కిడ్నీ సంబంధిత కారణాలు) l ఇన్ఫెక్షన్ లేదా ఫ్రాక్చర్ l మోకాళ్ల వద్ద పెరుగుదల ఆగిపోవడం l ఊబకాయం, సిండ్రోమిక్ చైల్డ్, అరుదుగా ఏర్పడే కణుతులు l బ్లౌంట్ వ్యాధి (విల్లు కాళ్లు ఏర్పడటానికి కారణం)
తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లల్లో గుర్తించిన వైకల్యం లేదా ఎముకల సమస్య కాలక్రమేణా పెరిగినా, పిల్లలు నడుస్తున్నప్పుడు ఇబ్బంది పడటం, తరచుగా పడిపోవడం లేదా పరిగెత్తడంలో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా పిల్లల ఆర్థోపెడీషియన్ను సంప్రదించాలి.
వంకర మోకాలు, విల్లు కాళ్ల సమస్యను ఎలా నిర్ధారించాలి?
పిల్లలను ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, కాళ్ల ఎక్స్-రే ద్వారా సమస్య ఉన్నదీ, లేనిదీ నిర్ధారిస్తారు.
ఈ సమస్యలకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి?
ఇలాంటి సమస్యలున్న చాలామంది పిల్లలకు చికిత్స అవసరం లేదు. కానీ, నిరంతర పర్యవేక్షణ అవసరం. ఇవి సాధారణంగా వాటంతట అవే సర్దుకుంటాయి. విటమిన్ డి లోపం వంటి వాటికి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు లెగ్ బ్రేసెస్ (పట్టీలు) వాడటం ద్వారా సమస్యను తగ్గించవచ్చు.
ఎలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరం?
సాధారణంగా సమస్యను గుర్తించడం ఆలస్యమైనా, చికిత్స అందించడం ఆలస్యంగా జరిగినా.. 8 గైడెడ్ గ్రోత్ ప్లేట్లను ఉంచడం ద్వారా తాత్కాలిక పరిష్కారం అందించవచ్చు. దీని ద్వారా పిల్లలు వెంటనే వారి కాళ్లపై బరువు వేస్తూ నడవవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత కొన్ని వారాలలో తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. పిల్లల్లో ఎదుగుదల ఆగిపోయినప్పుడు లేదా వైకల్యం అధికంగా ఉన్నప్పుడు Corrective Osteotomy (ఎముకను కట్ చేసి శస్త్ర చికిత్స అందించడం) ద్వారా చక్కని పరిష్కారం అందించవచ్చు.
శస్త్రచికిత్స చేయకుండా పరిష్కారం పొందవచ్చా?
పొట్ట దిగువ భాగంలో వైకల్యాన్ని సరిచేయాలి. అవయవాలు మొత్తం సమానంగా ఉండేలా చేయాలి. చికిత్స చేయకపోతే, మోకాలి కీలుకు హాని కలిగించవచ్చు. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్రమైన అంచనాతో, రోగ నిర్ధారణతోపాటు చికిత్స అందిస్తాం. పిల్లల భవిష్యత్తు ఎదుగుదలకు ఆటంకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే!
డాక్టర్ వెంకట్రామ్ త్యాలపల్లి కన్సల్టెంట్-పీడియాట్రిక్ ఆర్థోపెడీషియన్ అండ్ ఇలిజరోవ్ స్పెషలిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ Call: 8882 046 046 Visit: www.rainbowhospitals.in
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

