Protein Food For Fertility | సంతానోత్పత్తికి.. తోడ్పడే పోషకాఆహారం

రకరకాల పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ప్రత్యేకించి, కొన్ని అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి కొన్నిరకాల పోషకాలు చాలా అవసరం. అలా సంతానోత్పత్తికి తోడ్పడే ఆహార పదార్థాలూ అనేకం ఉన్నాయి.
రంగురంగుల కూరగాయలు
ఇంద్ర ధనుస్సులోని అన్నిరంగుల్లో దొరికే కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అలా అనేకానేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. ఇవన్నీ వీర్యం, అండాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
నట్స్
వాల్‌నట్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, బ్రెజిల్ నట్స్‌లోని సెలీనియం, పైన్ గింజల్లోని ఆర్జినైన్ మొదలైన పోషకాలు శరీరంలోని వేడిని, మంటను తగ్గిస్తాయి. దీంతో అండాశయంలో అండం నాణ్యత మెరుగై సంతానోత్పత్తికి మార్గం సుగమం అవుతుంది.
పీచు పదార్థాలు
పీచు ఎక్కువగా ఉండే ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్‌మీల్ పాస్తా, పొట్టుతీయని గోధుమతో చేసిన బ్రెడ్ మొదలైనవి హార్మోన్లను క్రమబద్ధీకరిస్తాయి. గర్భాశయ పొరలను మందంగా మార్చి, పిండం నిలిచేలా చేస్తాయి.
ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె
ఇందులోని మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సంతానోత్పత్తి హార్మోన్లను మెరుగుపరుస్తాయి. గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. విటమిన్-ఇ గర్భాశయ గోడలను మందం చేస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

