దానిమ్మ గింజలకు క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి ఉందని అమెరికాలోని ఫ్రాంక్ఫర్ట్ విశ్వ విద్యాలయ అధ్యయనంలో గుర్తించారు. దానిమ్మ గింజల్లో ఉండే యూరోలిథిన్-ఎ అనే పదార్థం శరీరంలో వ్యాధి నిరోధక కణాలను శక్తిమంతం చేస్తుంది. దీంతో ఆ కణాలు ట్యూమర్లపై మరింత బలంగా ప్రభావం చూపుతున్నట్టు ఫ్రాంక్ఫర్ట్ వైద్యులు గమనించారు.
పేగు క్యాన్సర్ల నివారణలో దానిమ్మ ప్రాధాన్యాన్ని ఆమోదించాల్సిందే అని తేల్చి చెప్పారు. యురోలిథిన్-ఎ కారణంగానే వ్యాధి నిరోధక కణాలు క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తున్నట్టు ఇతర పరిశోధనలూ నిరూపించాయి. కాబట్టి, రోజూ ఓ గుప్పెడు దానిమ్మ గింజలు నోట్లో వేసుకోవడం మంచిది.