బరువుకొద్దీ.. ప్రొటీన్
ఇటీవల స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి.. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్). నెలసరి ఇబ్బందులకు కారణమయ్యే ఈ జబ్బు కేశాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇటీవల స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి.. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్). నెలసరి ఇబ్బందులకు కారణమయ్యే ఈ జబ్బు కేశాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా మహిళల్లో పురుష హార్మోన్లుగా పిలిచే టెస్టోస్టిరాన్ లాంటివి అండాశయాలు, అడ్రినల్ గ్రంథులలో ఉత్పత్తి అవుతాయి. అవి చంకలు, వ్యక్తిగత భాగాల్లో వెంట్రుకల పెరుగుదలకు కారణం అవుతాయి. నెలసరి సమయంలో ఇవే హార్మోన్లు ఈస్ట్రోజెన్ (స్త్రీ హార్మోన్)గా పరిణామం చెందుతాయి. అయితే పీసీఓఎస్ బారిన పడినవారిలో అండాశయాల్లో కణుతులు ఉండటం వల్ల అధిక మోతాదులో ఈ పురుష హార్మోన్లు విడుదల అవుతాయి.
అవి వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోవడానికి కారణం అవుతాయి. దానివల్ల వెంట్రుకలు రంగుమారి, బలహీనంగా తయారవుతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో బట్టతలకు దారితీస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే శరీరంలో విటమిన్ డి, బి12, ఇనుము స్థాయులను సరిచూసుకుంటూ ఉండాలి. సరైన మోతాదులో తాజా కూరగాయలతో పాటు ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా కురుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయి. అందుకోసం అవిసె గింజలు, చేపలు భోజనంలో భాగం చేసుకోవాలి. సగటున రోజుకు ఒక కిలో శరీర బరువుకు ఒక గ్రాము ప్రొటీన్ తీసుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

