Paracetamol tablets | జ్వరం, నొప్పికి పారాసెటమాల్ వేసుకోవడం మంచిదేనా? డాక్టర్ల సిఫారసు లేకుండా వేసుకోవచ్చా?
కాస్త జ్వరంగా అనిపించినా, కొంత నొప్పి కలిగినా ఉపశమనం కోసం చాలామంది పారాసెటమాల్‌ను ఆశ్రయిస్తారు. అదీ డాక్టర్ల సిఫారసు లేకుండానే, ఏ మందుల దుకాణాల నుంచో తెచ్చుకుని. నిజానికి ఆ మాత్ర నొప్పి మూలకారణాన్ని తగ్గించదు.
Paracetamol tablets | కాస్త జ్వరంగా అనిపించినా, కొంత నొప్పి కలిగినా ఉపశమనం కోసం చాలామంది పారాసెటమాల్‌ను ఆశ్రయిస్తారు. అదీ డాక్టర్ల సిఫారసు లేకుండానే, ఏ మందుల దుకాణాల నుంచో తెచ్చుకుని. నిజానికి ఆ మాత్ర నొప్పి మూలకారణాన్ని తగ్గించదు. నొప్పి ఉంటుంది. మనం అనుభూతిచెందం అంతే. ఈ ఔషధం చుట్టూ కొన్ని అపోహలు పెనవేసుకుపోయాయి. వాటిని నివృత్తి చేసుకుందాం.
ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు
డాక్టర్ల సిఫారసు లేకుండా తీసుకోవడం మంచిది కాదు. రోజుకు సుమారు 4 గ్రాముల డోసేజీకి మించకూడదు. శరీర బరువులో కిలోగ్రాముకు 150 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం విషంగా పరిణమిస్తుంది. దీర్ఘకాలిక జబ్బులు, పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు, కాలేయ వ్యాధిగ్రస్తులు, మద్యం తాగేవారు రోజుకు 2 గ్రాములకు మించి తీసుకోకూడదు.
అన్ని దీర్ఘకాలిక నొప్పులకూ పనిచేస్తుంది
ఏ ఔషధమైనా దాని లక్ష్యం మేరకే ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులను పూర్తిగా నయం చేయలేదు. వెన్నునొప్పి, కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) లాంటి రుగ్మతలకు డాక్టర్లు సిఫారసు చేయరు. సర్జరీ తర్వాత తలెత్తే నొప్పుల్లో నలుగురిలో ఒకరికి మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది. తలనొప్పి విషయానికి వస్తే పదిమందిలో ఒకరికే ప్రభావం చూపుతుంది.
దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయి
ఇతర మందుల్లానే దీనికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చర్మం మీద దద్దుర్లు, తుంటిలో వాపు, తక్కువ రక్తపోటు (లోబీపీ), శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పడిపోయే హైపోథెర్మియా ఇబ్బంది పెట్టొచ్చు. కాకపోతే, పెయిన్ కిల్లర్లతో పోలిస్తే చెడు ప్రభావాలు తక్కువే. అందుకే, యాస్పిరిన్‌కు బదులుగా… చిన్నపిల్లలకు పారాసెటమాల్ సిఫారసు చేస్తారు.
లోపలి అవయవాలకు కీడుచేయదు
పారాసెటమాల్ ఓవర్‌డోస్ కాలేయ వైఫల్యానికి కారణమవుతుంది. అంతేకాదు ఒక్కోసారి కాలేయ మార్పిడి అవసరం కావచ్చు. కిడ్నీల మీద దుష్ప్రభావం పడవచ్చు. పొట్ట ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
అంత ప్రమాదకరం కాదు
డాక్టర్లు సూచించిన మోతాదు వరకైతే పారాసెటమాల్‌తో ప్రమాదమేమీ లేదు. అయితే తరచూ వాడితే మాత్రం వీటిలో ఉండే సోడియం లాంటి మూలకాల కారణంగా గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యం సంభవించేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.
ఇంజక్షన్ల రూపంలో మంచిది
ఇది నిజం కాదు. పైగా ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. కేవలం సర్జరీ అవసరమైన రోగులకు మాత్రమే ఇస్తారు. మామూలు వాళ్లకు సిఫారసు చేయరు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

