బద్ధకం వద్దు!
మలబద్ధకానికి ఒత్తిడి ఓ కారణమని చెబుతారు. ఒత్తిడిని వదిలించుకోవాలంటే.. ప్రతికూల ఆలోచనలను సానుకూల దృక్పథంతో భర్తీ చేయాలి.
జీర్ణవ్యవస్థకు ఎదురయ్యే వివిధ సమస్యలలో మలబద్ధకం ఒకటి. కదలికలు లేని జీవనశైలి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రమాత్రలు, పెయిన్ కిల్లర్లు సమస్యను జటిలం చేస్తాయి. ఒత్తిడి కూడా మలబద్ధకానికి దారితీస్తుంది. ఈ సమస్యను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.
శ్వాసపై ధ్యాస
మలబద్ధకానికి ఒత్తిడి ఓ కారణమని చెబుతారు. ఒత్తిడిని వదిలించుకోవాలంటే.. ప్రతికూల ఆలోచనలను సానుకూల దృక్పథంతో భర్తీ చేయాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు కూడా ఉపశమనం ఇస్తాయి. జీర్ణ వ్యవస్థ మందగించేలా చేసే కార్టిసోల్ హార్మోన్ విడుదల తగ్గేందుకు ధ్యానం సహక రిస్తుంది. అంతేకాదు, రక్తంలో చక్కెర స్థాయులను తగిన మోతాదులో ఉంచుకోవాలి. ఆహారం, జీవనశైలి మార్పులతోనూ సమస్య తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించాలి.
యోగా
నిత్యం ఆసనాలు వేయడం వల్ల జీర్ణ ప్రక్రియకు అవరోధం ఉండదు. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. మయూరాసనం, వజ్రాసనం, హలాసనం, పశ్చిమోత్తానాసనం ఆ ప్రయత్నంలో ఉపకరిస్తాయి.

ఆహారంలో జాగ్రత్తలు
తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినడం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. చిక్కుడు జాతి గింజలు, చిరు ధాన్యాలు,
మొలకలు, ఓట్స్ లాంటి ఫైబర్ ఆహారం తినాలి. మజ్జిగ తదితర ప్రొబయోటిక్ పదార్థాలు మంచి చేస్తాయి. పేగుల కదలికలు సాఫీగా ఉండటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పళ్లెంలో భాగం చేసుకోవాలి. మద్యం, ధూమపానం వద్దు. చక్కెర, టీ, కాఫీ తగ్గించుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

