పట్టుమని పాతికేండ్లు నిండకుండానే చాలామంది బీపీలు పెంచుకుంటున్నారు. మన అలవాట్లే బీపీ పెరగడానికి కారణమవుతున్నాయి. హై బ్లడ్‌ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్. దీనిని చాలా మంది సైలెంట్ కిల్లర్ అంటారు. ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే నెమ్మదిగా వస్తుంది. కానీ, గుండె, మెదడు, కిడ్నీలు, రక్తనాళాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల మందికి బీపీ ఉంది. అందులో చాలామందికి తమకు బీపీ ఉందని కూడా తెలియదు. మరి ఈ సైలెంట్ కిల్లర్ ఏ విధంగా మనలో చేరుతుంది, దాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం..
కూర్చొని పనిచేయడం: ఈ రోజుల్లో చాలామంది బిజీ లైఫ్ లీడ్ చేస్తూ శారీరక శ్రమకి దూరం అవుతున్నారు. డెస్క్ ఉద్యోగాల వల్ల.. ఎక్కువ సమయం కూర్చొనే ఉంటున్నారు. ఇది బీపీ పెరగడానికి కారణమవుతుంది. రోజంతా డెస్ దగ్గర కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనమవుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రీసెర్చ్ ప్రకారం… వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, పొగ తాగడం, ఎకువ మద్యం సేవించడం ఇవన్నీ బీపీని పెంచేవే.
తినే ఆహారం: బీపీ పెరగడంలో తినే ఆహారం కూడా చాలా ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ స్నాక్స్ వంటి పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఎకువ ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ అవుతుంది. దాంతో గుండె ఎకువ పని చేయాల్సి వస్తుంది. అదే సమయంలో పండ్లు, కూరగాయలు తకువ మోతాదులో తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణ కష్టతరమవుతుంది.
అధిక ఒత్తిడి: ఎప్పుడూ స్ట్రెస్ ఫీలవడం, నిద్రలేమితనం, కంప్యూటర్-ఫోన్ స్క్రీన్కు అతుక్కుపోవడం. ఇవన్నీ హార్మోన్ల మార్పులకు దారితీసి తాతాలికంగా బీపీని పెంచుతాయి. ఆ తర్వాత అది స్థిరంగా మారే ప్రమాదం ఉంది.
చాలామందికి బీపీ ఉన్నా మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే రెగ్యులర్‌గా చెక్ చేయడం చాలా అవసరం. అయితే బీపీ చాలా ఎకువగా పెరిగితే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఉదయాన్నే తలవొప్పి రావడం, తల తిరగడం లేదా చూపు మసకబారడం, ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, ముకు నుంచి రక్తస్రావం, గుండె కొట్టుకునే వేగంలో మార్పు రావడం ఇవన్నీ కనిపిస్తాయి.
నిత్య వ్యాయామం, ఉప్పు తగ్గించడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, కంటి నిండా నిద్రపోవడం.. ఇవన్నీ బీపీని నియంత్రిస్తాయి. ఎకువ ఒత్తిడికి గురయ్యేవారు రెగ్యులర్‌గా బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీని నిర్లక్ష్యం చేయకుండా జీవనశైలిని మార్చుకుంటూనే, వైద్యుణ్ని రెగ్యులర్‌గా సంప్రదించడం అవసరం.