రోజూ ఈ టైంలో బ్రష్ చేస్తే ఎక్కువకాలం బతుకొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి..!!
దంతాల ఆరోగ్యానికి దీర్ఘాయువుకు సంబంధం ఉందా? రోజూ రాత్రి బ్రష్ చేస్తే ఎక్కువకాలం బతుకొచ్చా? పండ్ల సంఖ్యపై మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందా? అంటే అవుననే అంటోంది ఓ నూతన అధ్యయనం. మంచి నోటి ఆరోగ్యం అనేది దీర్ఘాయువుకు తోడ్పుడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం, ఫ్లాసింగ్, దంత వైద్యుడిని క్రమంతప్పకుండా సంప్రదించడం దీర్ఘాయువుకు సహాయపడుతాయని పరిశోధకులు తేల్చారు. రాత్రిపూట పళ్లు తోముకోకపోవడం వల్ల అకాల మరణాల ప్రమాదం 25-30 శాతం, ఫ్లాసింగ్ చేసుకోకపోవడం వల్ల 30 శాతం పెరుగుతుందని గుర్తించారు.

ఈ అధ్యయనం ప్రకారం దంతాల సంఖ్య కూడా ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు కనుగొన్నారు. దంతాలు లేని వ్యక్తులు.. 20, అంతకంటే ఎక్కువ దంతాలున్నవారితో పోలిస్తే 30 శాతం ముందస్తు మరణ ప్రమాదాన్ని కలిగి ఉంటారు. 70 ఏళ్ల వయస్సులో 20 లేదా అంతకంటే ఎక్కువ దంతాలు ఉన్న వ్యక్తులు.. 20 కంటే తక్కువ దంతాలున్నవారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. నోటి ఆరోగ్యం.. ఎక్కువ కాలం జీవించే అవకాశాలను మెరుగుపరుస్తుందని గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు ‘కమ్యూనిటీ డెంటిస్ట్రీ అండ్ ఓరల్ ఎపిడెమియాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!