సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Jun 08, 2020 , 13:41:49

ముక్కుదిబ్బడను వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు..!

ముక్కుదిబ్బడను వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు..!

ఎండలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు మొదలవుతున్నాయి. ఈ వర్షాలతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొందరికి జలుబు ఉండదు కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది. దీంతో గాలి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ముక్కుదిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

* గోరువెచ్చని నీటిని కొద్దిగా తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం నీటి నుంచి కొన్ని చుక్కలను తీసుకుని ముక్కు రంధ్రాల్లో వేయాలి. దీంతో ముక్కులో ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఫలితంగా ముక్కు రంధ్రాలు క్లియర్ అయి శ్వాస సరిగ్గా ఆడుతుంది.

* రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా నలిపి వాటిని అలాగే తిన్నా లేదంటే వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసి గోరు వెచ్చని నీటిలో ఆ మిశ్రమాన్ని కలిపి తాగినా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

* ముక్కు దిబ్బడను తగ్గించేందుకు ఉల్లిగడ్డలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గుతుంది.

* ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒకటి, రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపి రోజుకు మూడు పూటలా తాగితే ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆ మిశ్రమంలో తేనె కలిపితే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది.

* నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని కలిపి ముక్కుపై రాయాలి. కొంత సేపటికి ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

* నిత్యం రెండు సార్లు టమాటా జ్యూస్‌ను తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.


logo