Monkeypox vaccine | మంకీపాక్స్ టీకాలు 100% ప్రభావవంతమైనవి కావు: డబ్ల్యూహెచ్ఓ వెల్లడి
Monkeypox vaccine | మంకీపాక్స్ వ్యాధి నివారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 100 శాతం ప్రభావవంతంగా లేవు. ప్రజలు స్వంతంగా ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గించుకోవాలి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
Monkeypox vaccine | జెనీవా: మంకీపాక్స్ వ్యాధి నివారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 100 శాతం ప్రభావవంతంగా లేవు. ప్రజలు స్వంతంగా ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గించుకోవాలి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) టెక్నికల్ లీడ్ రోసముండ్ లూయిస్ బుధవారం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. మంకీపాక్స్ వ్యాధి నివారణ అంతా మన చేతుల్లోనే ఉన్నదని, వ్యాక్సిన్లపై ఆధారపడకుండా చూసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దీనికి సంబంధించి మా వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. వ్యాక్సిన్ వెండి బుల్లెట్ కాదనేది ఇది మనకు గుర్తుచేస్తుంది’ అని రోసముండ్ చెప్పారు.
గత వారంలో దాదాపు 7,500 కేసులు నమోదయ్యాయని, గత వారంతో పోలిస్తే ఇది 20 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. పురుషులతో సెక్స్‌లో పాల్గొనే పురుషుల్లో ఎక్కువ సంఖ్యలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, మరీ ముఖ్యంగా యూరప్, అమెరికాల నుంచి రికార్డవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చెప్పారు.
ఇప్పటివరకు 92 దేశాల్లో దాదాపు 35 వేల కేసులు నమోదయ్యాయని, దాదాపు 12 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. గత వారం 7,500 కేసులు రికార్డయ్యాయి. మంకీపాక్స్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తున్నదని గత నెలలో టెడ్రోస్ ప్రకటించారు. చాలా మంది సాధారణంగా మంకీపాక్స్ నుంచి చికిత్స లేకుండానే కొన్ని వారాల్లోనే కోలుకుంటున్నారు. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో జ్వరం, చలి, లింఫ్ నోడ్స్ వాపు కనిపిస్తాయి. తర్వాత పెద్ద మొత్తంలో దద్దుర్లు వస్తాయి. చిన్న పిల్లలు, గర్భిణీలు, వ్యాధి నిరోధక శక్తి లేని వ్యక్తుల్లో ఈ మంకీ పాక్స్ తీవ్రంగా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

