రకరకాల కారణాల వల్ల పీడించే మైగ్రేన్ తలనొప్పి తలెత్తితే నిమిషం ఒక యుగంగా భారంగా గడిచిపోతుంది. భరించలేని నొప్పికి సత్వర ఉపశమనం కావాలని కోరుకుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే కాస్తయినా ఉపశమనం పొందవచ్చు.
పుదీనా: పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్, మెంథోన్ మైగ్రేన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను రుబ్బి, దాని నుంచి రసం తీసి నుదురుపై పూయాలి. అలాగే ఒక కప్పు వేడి వేడి బ్లాక్ టీ లో కొన్ని పుదీనా ఆకులు వేసి 10నిమిషాలు నానిన తర్వాత తీసుకుంటే మైగ్రేన్ నుంచి విముక్తి లభిస్తుంది.
అల్లం: అల్లంలో ఉండే జింజెరోల్స్ అని పిలిచే రసాయనం మైగ్రేన్‌ను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. అల్లం, నిమ్మ రసాలను సమాన మోతాదుల్లో కలుపుకొని, రోజుకు 2 నుంచి 3 సార్లు తాగాలి. తాజా నీటిలో అల్లం ముక్కలు లేదా అల్లం ముక్కల పొడి వేసి ఆవిరి పీలిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నిద్ర: నిద్ర లేమి వల్ల మైగ్రేన్ వస్తూ ఉంటుంది. అందువల్ల నిద్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజూ 8 గంటల సమయం నిద్రకు కేటాయించాలి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్‌ను కొంత మేరకు ఎదుర్కోవచ్చు.