Yoga | యోగా చేయడంపై చాలా మందికి ఉండే అపోహలు ఇవే.. నిపుణులు ఏమంటున్నారంటే..?
యోగా సాధనను సరిగ్గా చేస్తే అది కేవలం ట్రెండ్‌గా కాకుండా జీవితాంతం ఆరోగ్యం, మానసిక సమతుల్యతకు బలమైన పునాది వేస్తుంది. అయితే ప్రాచుర్యం పెరిగిన కొద్దీ కొన్ని అపోహలు కూడా పెరిగాయి. యోగా అంటే ఏమిటి, అది శరీరానికి ఎలా శిక్షణ ఇస్తుంది, ఫలితాలు ఎలా కనిపిస్తాయి అన్న విషయాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అపోహలు కొనసాగుతున్నాయి.
Yoga | యోగా సాధనను సరిగ్గా చేస్తే అది కేవలం ట్రెండ్‌గా కాకుండా జీవితాంతం ఆరోగ్యం, మానసిక సమతుల్యతకు బలమైన పునాది వేస్తుంది. అయితే ప్రాచుర్యం పెరిగిన కొద్దీ కొన్ని అపోహలు కూడా పెరిగాయి. యోగా అంటే ఏమిటి, అది శరీరానికి ఎలా శిక్షణ ఇస్తుంది, ఫలితాలు ఎలా కనిపిస్తాయి అన్న విషయాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అపోహలు కొనసాగుతున్నాయి. సురక్షిత సాధన ఎలా ఉండాలో కూడా చాలా మందికి తెలియదు. యోగాపై ఉన్న అపోహల గురించి అలాగే దాని వెనుక ఉన్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం ఆసనాలు మాత్రమే కాదు..
యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే అనుకుంటారు చాలా మంది. యోగాను కేవలం నేడు ఎన్ని ఆసనాలు చేశాం అనే స్థాయికి పరిమితం చేస్తే అది ఒక ప్రదర్శనగా మారుతుంది. వాస్తవానికి ఆసనాలు యోగాలో ఒక భాగం మాత్రమే. శ్వాస, దృష్టి, అవగాహన కూడా అంతే ముఖ్యమైనవి. కేవలం ఆకారాలపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, పోలికలు పెరిగి ఆరోగ్యానికి బదులుగా సమస్యలు వస్తాయి. ఆసనాలను సాధనలో స్థిరత్వం కోసం ఉపయోగించాలి, ప్రదర్శన కోసం కాదు. యోగా కేవలం స్ట్రెచింగ్ మాత్రమే, శక్తి పెరగదు అనే అపోహ కూడా చాలా మందికి ఉంటుంది. యోగాను చాలామంది కేవలం వంపులు, స్ట్రెచింగ్గా భావిస్తారు. కానీ సరైన విధంగా చేస్తే ఇది శరీరానికి బలం, సమతుల్యత, కండరాల నియంత్రణ, కీళ్ల స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్లాంక్ (ఫలకాసనం), చైర్ పోజ్, సూర్య నమస్కారాల వంటివి శక్తిని పెంచే సాధనలు. యోగాతో పాటు ఇతర వ్యాయామాలు చేయడం కూడా మంచిదే. ముఖ్యంగా శరీరానికి ఏది సరిపోతుందో అదే ఎంచుకోవాలి. అదే విధంగా యోగా ఫలితాలు ఆలస్యంగా వస్తాయనే అపోహ కూడా ఉంది. యోగా ఫలితాలు వెంటనే కనిపించవని చాలామంది భావిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఒత్తిడి తగ్గడం, శ్వాస మెరుగుపడటం, నిద్ర బాగా పట్టటం వంటి ప్రయోజనాలు త్వరగా కనిపిస్తాయి. అయితే కండరాల బలం, శరీర నిర్మాణ మార్పులు రావడానికి సమయం పడుతుంది. సరైన ఫలితాలు పొందాలంటే నిరంతర సాధన అవసరం. ఫలితాలను కొలిచే విధానం కూడా సరైనదై ఉండాలి.
యోగా ఎవరికైనా అనుకూలమే..
అలాగే యోగా ప్రారంభించడానికి ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్ అవసరమని చాలా మంది భావిస్తారు. యోగా చేయాలంటే ముందుగా శరీరం వంగాలి, ఫిట్‌గా ఉండాలి అనుకోవడం పెద్ద అపోహ. యోగా ప్రతి ఒక్కరికీ అనుకూలంగా మార్చుకునే విధంగా ఉంటుంది. కుర్చీలు, గోడ సపోర్ట్, ఇతర మార్పుల వంటివి అందుకే ఉన్నాయి. శరీరం ఎలా ఉందో అలా ప్రారంభించాలి. సరైన మార్గదర్శకత్వంలో సాధన చేస్తే ఎవరికైనా యోగా సాధ్యమే. యోగా సాధన సాధారణంగా మంచిదే అయినా అది పూర్తిగా ప్రమాద రహితం కాదు. తప్పుగా చేసే ఆసనాలు, అధిక ఒత్తిడి, నొప్పిని పట్టించుకోకపోవడం వల్ల గాయాలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కంటి సమస్యలు, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, ఎముకల బలహీనత, గర్భధారణ వంటి పరిస్థితుల్లో వైద్య సలహా తీసుకోవాలి. నిపుణుల మార్గదర్శకత్వంలో సాధన చేయడం తప్పనిసరి. యోగాను ప్రదర్శనగా కాకుండా జీవన విధానంగా చూడాలి. ఇది కేవలం ఆసనాలు, స్ట్రెచింగ్ కాదు, అందరికీ అందుబాటులో ఉన్న సాధన. సరైన మార్గంలో, నిరంతరంగా చేస్తే యోగా శరీరానికి బలం, మనసుకు స్థిరత్వం, జీవితానికి నమ్మకాన్ని అందిస్తుందని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Yoga
- Yoga Asanas
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

