Coconut Oil : కొబ్బరి నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు, మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇది గుండె ఆరోగ్యం నుంచి బరువు తగ్గే ప్రక్రియ వరకూ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
కొబ్బరి నూనెలో మంచి కొలెస్ట్రాల్‌గా చెప్పే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచే లౌరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. ఇక కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ సులభంగా జీర్ణమవడంతో పాటు జీవక్రియలను వేగవంతం చేయడంతో కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియ మెరుగవుతుంది.
ఇది ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావన కలిగించడంతో బరువు తగ్గేందుకూ ఉపకరిస్తుంది. ఇంకా కొబ్బరి నూనెతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
గుండె ఆరోగ్యానికి మేలు
బరువు తగ్గడం
మెదడుకు మేలు
చర్మ, కేశ సంరక్షణ
రోగ నిరోధక శక్తి బలోపేతం
జీర్ణక్రియ మెరుగుదల
మధుమేహ నియంత్రణ
ఎముకల బలోపేతం
యాంటీ ఇన్ఫ్లమేషన్
హోర్మోన్ల సమతుల్యత
Read More :
Food Habits | తిండి తిప్పలు.. మితం తప్పితే అమృతమైనా విషమే