Parenting | మూత్రంలో రక్తం ప్రాణాంతకమా?
మా బాబు వయసు పన్నెండు సంవత్సరాలు. కొన్నిరోజులుగా తన మూత్రం ఎర్రగా పడుతున్నది. నొప్పి లేదంటున్నాడు. కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఉదయం వేళ ముఖం వాపుగా కనిపిస్తున్నది. ఇదేమైనా ప్రాణాంతకమైన వ్యాధా?
Parenting | మా బాబు వయసు పన్నెండు సంవత్సరాలు. కొన్నిరోజులుగా తన మూత్రం ఎర్రగా పడుతున్నది. నొప్పి లేదంటున్నాడు. కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఉదయం వేళ ముఖం వాపుగా కనిపిస్తున్నది. ఇదేమైనా ప్రాణాంతకమైన వ్యాధా?
- సుజాత, కామారెడ్డి
రక్తం వల్ల మూత్రం ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ సమస్యను హీమటూరియా అంటారు. మీ బిడ్డకు ఉన్న సమస్య హీమటూరియానా లేక ఇంకేవైనా కారణాల వల్ల వస్తుందా అనేది పరీక్షల ద్వారానే తేల్చాలి. మీ అబ్బాయి రక్తపోటు ఎలా ఉందో చెప్పలేదు. ముఖం వాపు ఉందంటున్నారు. ఈ లక్షణాలను పరిశీలిస్తే నెఫ్రయిటిక్ సిండ్రోమ్ సమస్య అయి ఉండవచ్చు. మూత్రంలో ప్రొటీన్లు పోవడాన్ని నెఫ్రయిటిక్ సిండ్రోమ్ అంటారు. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడిన కొన్ని వారాల తర్వాత కూడా కిడ్నీలపై ప్రభావం ఉంటుంది.
ఇటీవల వచ్చిన ఆరోగ్య సమస్యల గురించి వివరించ లేదు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) శరీర భాగాలపై కూడా పనిచేస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ మార్పుల వల్ల గ్లోమరులో నెఫ్రయిటిస్ కండిషన్ ఏర్పడుతుంది. మీ అబ్బాయి సమస్య ఏమిటో కచ్చితంగా నిర్ధారించడానికి రక్త, మూత్ర పరీక్షలు చేయించాల్సిందే! ముందుగా పిల్లల వైద్యులను సంప్రదించండి. వీలయితే పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి. రక్త, మూత్ర పరీక్షలతోపాటు కిడ్నీలను అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఎదురు చూడాల్సిన సమయం కాదు. జబ్బు నిర్ధారణ తర్వాత చికిత్స ఉంది. కాబట్టి కంగారు పడవద్దు. ఆలస్యం చేయవద్దు.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

