ఐరన్ అందాలంటే..
మనం తినే ఆహారంలో ఐరన్ ఎంత ఉందనేదాని కన్నా, ఆ ఐరన్‌ను మన శరీరం ఏ మేరకు లోపలికి గ్రహిస్తున్నది అనేదే ముఖ్యం. ఎంత మంచి ఆహారం తీసుకున్నా శోషణ సరిగా లేకపోతే ప్రయోజనం శూన్యం.
మనం తినే ఆహారంలో ఐరన్ ఎంత ఉందనేదాని కన్నా, ఆ ఐరన్‌ను మన శరీరం ఏ మేరకు లోపలికి గ్రహిస్తున్నది అనేదే ముఖ్యం. ఎంత మంచి ఆహారం తీసుకున్నా శోషణ సరిగా లేకపోతే ప్రయోజనం శూన్యం. ఈ సమస్యకు చెక్ పెడుతూ, శరీరంలో ఐరన్ శోషణను వేగవంతం చేసి హిమోగ్లోబిన్‌ను పెంచే ఆ చిట్కాలేమిటో తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరచడం: ఐరన్‌ను శరీరం పూర్తిగా గ్రహించాలంటే మన జీర్ణక్రియ అద్భుతంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణాశయంలో ఉండే స్టమక్ యాసిడ్ పరిమాణం సరిగ్గా ఉండటం ముఖ్యం. అప్పుడే మనం తినే ఆహారం బాగా జీర్ణమై అందులోని పోషకాలు అందుతాయి. అందుకోసం ఒక చిన్న అల్లం ముకను నిమ్మరసంలో అరగంట పాటు నానబెట్టాలి. భోజనం చేయడానికి సరిగ్గా పది నిమిషాల ముందు ఆ అల్లం ముకను బాగా నమిలి తినాలి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పేగులపై ఫోకస్: ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ముందుగా పేగుల ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే పేగుల ఆరోగ్యమే శరీరంలోని మిగిలిన అన్ని అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. నిరంతరం కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో సతమతమవుతుంటే వెంటనే వాటిని నయం చేసుకోవాలి. పేగులు ఆరోగ్యంగా లేకపోతే ఐరన్ శోషణ అంతగా జరగదు.
ఐరన్ మాత్రమే కాదు: శరీరంలో రక్తం తకువగా ఉందని కేవలం ఐరన్ ఎకువగా ఉండే ఆహారాలు మాత్రమే తింటే ఫలితం ఉండదు. ఆహారం ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండాలి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఐరన్‌తో పాటు ప్రొటీన్, విటమిన్ బీ12, బీ6 వంటి పోషకాలు కూడా ఎంతో అవసరం.
వాపులకు విరుగుడు: ఈ రోజుల్లో జంక్‌ఫుడ్ తినడం, అనారోగ్యకరమైన జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి కారణంగా శరీరంలో అంతర్గత వాపులు పెరుగుతున్నాయి. ఇవి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాలేయంపై ఒత్తిడి పడితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనివల్ల కాలేయం తనను తాను డిటాక్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
తిండిలో మార్పు: మీ ఆహారంలో కాకరకాయ, చేదు కూరగాయల సూప్స్ వంటి పదార్థాలను చేర్చుకోండి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరిచి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతాయి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటున్నప్పుడు, దాంతో పాటు ఏ ఆహారాన్ని కలిపి తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఐరన్ శరీరానికి పట్టాలంటే దానికి విటమిన్ సి తోడు కావాలి. అప్పుడే ఆహారంలోని ఐరన్‌ను శరీరం పూర్తిగా శోషించుకోగలదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

