Randeep Guleria | కొవిడ్‌లా పాకుతున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్ : రణదీప్ గులేరియా
Randeep Guleria | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గుర్తించిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ (ex AIIMS chief) డా. రణదీప్ గులేరియా (Randeep Guleria) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Randeep Guleria | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గుర్తించిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ (ex AIIMS chief) డా. రణదీప్ గులేరియా (Randeep Guleria) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ కొవిడ్ (Covid-19)లా వ్యాపిస్తోందని అన్నారు. గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సాధారణంగా ఏటా ఈ సమయంలో మార్పులకు లోనవుతుందని చెప్పారు. పెద్దలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 (Influenza virus H3N2) కేసులు పెరుగుతున్నాయి. ఏటా ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ (antigenic drift) అంటారు. గతంలో వచ్చిన H1N1 వైరస్ ఇప్పుడు H3N2గా రూపాంతరం చెందింది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే జనం సులభంగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, ముక్క కారడం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి’ అని గులేరియా వివరించారు.
ఈ వైరస్ బిందువులు, తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందుతుందని ఆయన చెప్పారు. ఇది సాధారణ ఫ్లూ వేరియంటే అని.. అయితే, వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోందన్నారు. ఈ కారణంతోనే వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు. అయితే, ఇదేమంతా ఆందోళనకరమైన అంశం కాదని, కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల ఏమీ లేదని డా. గులేరియా స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 (H3N2) సహజంగానే మార్పులకు లోనవతుంటుందని చెప్పుకొచ్చారు.
అయితే, H3N2 వైరస్ కూడా కొవిడ్-19 (Covid-19) వలే వ్యాప్తి చెందుతోందని డాక్టర్ గులేరియా హెచ్చరించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్ఫ్లుయెంజా (Influenza virus) కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని చెప్పారు. కాబట్టి.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని డాక్టర్ రణదీప్ గులేరియా (Randeep Guleria ) సూచించారు.
Also Read..
Rajasthan | రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో.. వింత శిశువు జననం..!
Hardik Pandya | పాండ్యా అరుదైన రికార్డు.. దిగ్గజాలను దాటుకుని
Heart Attack | గుండె ఆకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతుంది.. కార్డియాక్ అరెస్ట్‌ను సీపీఆర్‌తో ఆపొచ్చా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

