Eyes | కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే అవి థైరాయిడ్ వ్యాధులకు సంకేతం కావచ్చు..
థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా బరువు మార్పులు, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే కళ్లలో కనిపించే కొన్ని మార్పులు కూడా థైరాయిడ్ వ్యాధులకు ముఖ్యమైన సంకేతాలుగా ఉంటాయి. ముఖ్యంగా గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలో కళ్ల లక్షణాలు తొలిదశలోనే కనిపించే అవకాశం ఉంటుంది.
Eyes | థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా బరువు మార్పులు, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే కళ్లలో కనిపించే కొన్ని మార్పులు కూడా థైరాయిడ్ వ్యాధులకు ముఖ్యమైన సంకేతాలుగా ఉంటాయి. ముఖ్యంగా గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలో కళ్ల లక్షణాలు తొలిదశలోనే కనిపించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది ఈ సంకేతాలను గుర్తించకపోవడం వల్ల సరైన నిర్ధారణ ఆలస్యమవుతోంది. అలాంటి లక్షణాల్లో థైరాయిడ్ ఐ డిసీజ్ ఒకటి. థైరాయిడ్ ఐ డిసీజ్ (TED) లేదా గ్రేవ్స్ ఆర్బిటోపతి అనేది థైరాయిడ్ సమస్యలతో సంబంధం ఉన్న కంటి వ్యాధి. గ్రేవ్స్ డిసీజ్ ఉన్న రోగుల్లో అధిక శాతం మందికి ఈ సమస్య కనిపిస్తుంది. కొన్నిసార్లు థైరాయిడ్ వ్యాధి నిర్ధారణకు ముందే కళ్లలో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల ఈ లక్షణాలపై అవగాహన చాలా ముఖ్యం.
కళ్ల చుట్టూ వాపులు ఉంటే..
కళ్ల చుట్టూ నిరంతరంగా వాపు లేదా ఉబ్బరం కనిపించడం ఈ వ్యాధికి తొలి సంకేతాల్లో ఒకటిగా పరిగణించాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా లేదా సరైన నిద్రపోయినా తగ్గని ఉబ్బరం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కళ్లలో ఇసుక ఉన్నట్లుగా అనిపించడం, పొడిబారడం లేదా కళ్ల వెనుక భాగంలో ఒత్తిడి ఉన్న భావన కూడా థైరాయిడ్ ఐ డిసీజ్‌కు సంకేతం అవుతుంది. కొంతమందిలో కళ్లు సాధారణం కంటే ఎక్కువగా బయటకు వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని ప్రోప్టోసిస్ అని పిలుస్తారు. అలాగే డబుల్ విజన్, కాంతిని తట్టుకోలేకపోవడం, నిద్ర సమయంలో కళ్లను పూర్తిగా మూయలేకపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. వ్యాధి మరింత తీవ్రమైన దశకు చేరుకుంటే దృష్టి నరంపై ఒత్తిడి పెరిగి చూపుపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధిని గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. ఎందుకంటే లక్షణాలు చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. కళ్లు పొడిబారడాన్ని ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వల్ల వచ్చిన సమస్యగా భావించడం, కళ్ల చుట్టూ వాపును అలసట ప్రభావంగా తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది. దీంతో సరైన చికిత్స పొందడంలో నెలలు లేదా సంవత్సరాల ఆలస్యం అవుతుంది.
ధూమపానం చేసే వారు అయితే..
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో కంటి పరీక్షలు కూడా క్రమం తప్పకుండా చేయించుకోవడం అవసరం. కంటి వైద్యులు ఈ లక్షణాలను గమనించినప్పుడు థైరాయిడ్ పరీక్షలను సూచిస్తారు. అలాగే థైరాయిడ్ చికిత్స పొందుతున్న రోగులకు కంటి ఆరోగ్య పరీక్షలు కూడా చికిత్సలో భాగంగా ఉండాలి. ధూమపానం థైరాయిడ్ ఐ డిసీజ్ తీవ్రతను మరింత పెంచే ప్రధాన ప్రమాద కారకాలలో ఒకటిగా మారుతోంది. థైరాయిడ్ సమస్యలతోపాటు ధూమపానం చేసే వారిలో కళ్లపై ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అలవాటును మానడం ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కళ్లలో అసాధారణ మార్పులు కనిపించినప్పుడు వాటిని చిన్న సమస్యగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు కళ్లు ఇస్తున్న ఈ హెచ్చరిక సంకేతాలే ఇంకా బయటపడని థైరాయిడ్ సమస్యను ముందుగానే గుర్తించే అవకాశాన్ని కల్పిస్తాయి. సమయానికి నిర్ధారణ, చికిత్స పొందడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని, దృష్టిని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- eyes
- health tips
- Healthy foods
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

