Health Tips | సంతానలేమి సమస్యలకు థైరాయిడ్‌తో సంబంధం ఉందా ?
Health Tips | థైరాయిడ్ గ్రంథి అనేది సంతానలేమి విషయంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. దానికి వెంటనే చికిత్స అందించాలి. ఇలాంటి వాళ్లు గర్భం ధరించినప్పుడు మొదటి మూడు నెలల్లో గర్భస్థ పిండం థైరాయిడ్‌ను తయారు చేసుకోలేదు. అలాంటి సమయంలో తల్లికి థైరాయిడ్ డోస్ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఇది తల్లి నుంచి బిడ్డకు వెళ్లాలి. న్యూరలాజికల్ డెవలప్మెంట్.. అంటే మెదడు, నాడీ వ్యవస్థలాంటివి తయారయ్యేందుకు కూడా థైరాయిడ్ చాలా ముఖ్యం.
Health Tips | ఇటీవల చాలామందిలో థైరాయిడ్ సమస్య కనిపిస్తున్నది. ప్రత్యేకించి, హైపో థైరాయిడిజం గురించి నాకో సందేహం ఉంది. సెక్స్ పట్ల అయిష్టత, సంతాన సాఫల్య సమస్యకు ఈ రుగ్మతతో ఏమైనా సంబంధం ఉందా? నేను కూడా హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నా. ఓ పరిష్కారం చెప్పండి ప్లీజ్.
-ఓ పాఠకురాలు
థైరాయిడ్ గ్రంథి అనేది సంతానలేమి విషయంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. దానికి వెంటనే చికిత్స అందించాలి. ఇలాంటి వాళ్లు గర్భం ధరించినప్పుడు మొదటి మూడు నెలల్లో గర్భస్థ పిండం థైరాయిడ్‌ను తయారు చేసుకోలేదు. అలాంటి సమయంలో తల్లికి థైరాయిడ్ డోస్ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఇది తల్లి నుంచి బిడ్డకు వెళ్లాలి. న్యూరలాజికల్ డెవలప్మెంట్.. అంటే మెదడు, నాడీ వ్యవస్థలాంటివి తయారయ్యేందుకు కూడా థైరాయిడ్ చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్య వల్ల సమయానికి అండం విడుదల కాదు. సక్రమంగా నెలసరి రాదు. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోతే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఫలితంగా, నెలసరిలో అధిక రక్తస్రావం అవుతుంది. సంతాన సమస్యలు ఏర్పడతాయి.
నెలసరి ఎగుడు దిగుడుల వల్ల చాలామంది దీన్ని పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)గా పొరబడతారు. అలాంటి అనుమానం వచ్చినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలా అని, ఇది కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు. కాలుష్యం వల్ల శరీరంలో అయోడిన్ తక్కువైనా ఇలా జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ చాలా ముఖ్యం. అందుకే అయోడైజ్డ్ ఉప్పును సూచిస్తుంటాం. ఇక, సెక్స్ విషయంలో విముఖతకు, థైరాయిడ్‌కు పెద్దగా సంబంధం లేదనే చెప్పవచ్చు. పరీక్షల ద్వారానే కారణాన్ని నిర్ధారించగలం.
– డాక్టర్ పి. బాలాంబ,
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

