నీళ్ల నుంచి పుట్టిన మంట
హైడ్రోజన్ పెరాక్సయిడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. హెచ్2ఓ2 అనే రసాయన సంకేతాన్ని కలిగి ఉండే ఈ ద్రవ పదార్థాన్ని గాయాలు కడగడం మొదలుకుని దంతాలను మిలమిలలాడేలా చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో వినియోగిస్తుంటారు.
హైడ్రోజన్ పెరాక్సయిడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. హెచ్2ఓ2 అనే రసాయన సంకేతాన్ని కలిగి ఉండే ఈ ద్రవ పదార్థాన్ని గాయాలు కడగడం మొదలుకుని దంతాలను మిలమిలలాడేలా చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో వినియోగిస్తుంటారు. అయితే, దీన్ని అవసరానికి మించి ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.
- హైడ్రోజన్ పెరాక్సయిడ్ అనేది యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. వైద్యపరంగా దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ, తగిన విధంగా వాడకపోతే మాత్రం ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాలే చూపుతుంది.
- ఈ ద్రావకాన్ని చర్మానికి పట్టించినప్పుడు మంట, ఎర్రగా మారిపోవడం, కొన్నిసార్లు బొబ్బలెక్కే ప్రమాదం కూడా ఉంది. ఎవరో చెప్పారు కదా అని అధిక పరిమాణంలో దీన్ని వాడితే ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
- హైడ్రోజన్ పెరాక్సయిడ్ను కొద్ది పరిమాణంలో కూడా నోట్లోకి తీసుకోకూడదు. ఇలా చేస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వికారం, వాంతులు, అంతర్గత రక్తస్రావం మొదలైన ఇబ్బందులు వస్తాయి. అంతేకాదు రక్తనాళాల్లో గాలి బుడగలు ఏర్పడి రక్త సరఫరాకు ఆటంకంకలుగుతుంది. వైద్యపరంగా ఈ పరిస్థితిని గ్యాస్ ఎంబాలిజం అంటారు. ఇది ప్రాణాలకు ప్రమాదం కూడా కలిగించవచ్చు.
- ఈ ద్రవాన్ని ముక్కుతో పీలిస్తే శ్వాసనాళంలో మంట కలిగిస్తుంది. దగ్గు వస్తుంది. ఊపిరి తీసుకోవడం మందగిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో
ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ పేరుకుపోయే పరిస్థితి అయిన పల్మనరీ ఎడెమాకు దారితీయొచ్చు. - హైడ్రోజన్ పెరాక్సయిడ్ కంటికి తగిలితే విపరీమైన మంట, నొప్పి పుడతాయి. పైగా కొన్ని తీవ్రమైన సందర్భాల్లో చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయాల్లో నష్ట నివారణ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. తగిన చికిత్స చేయించుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

