Parenting | మీకు పుట్టుకతోనే వినికిడి లోపమా?.. అయితే మీ పిల్లలకు కూడా..
డాక్టర్‌గారూ! నేను ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిని. ప్రతినెలా డాక్టర్‌ను సంప్రదిస్తున్నాను. అన్ని పరీక్షలూ చేయించుకుంటున్నాను. స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్ అన్నీ బాగున్నాయని చెప్పారు.
Parenting | డాక్టర్‌గారూ! నేను ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిని. ప్రతినెలా డాక్టర్‌ను సంప్రదిస్తున్నాను. అన్ని పరీక్షలూ చేయించుకుంటున్నాను. స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్ అన్నీ బాగున్నాయని చెప్పారు. అయితే, మావారి తమ్ముడికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నది. దాంతో అతనికి మాటలు కూడా రాలేదు. సైగల ద్వారా మాట్లాడుతాడు. మాకు పుట్టబోయే బిడ్డకూ అటువంటి రిస్క్ ఉంటుందా? అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి.
- ఓ పాఠకురాలు
మీరు చెప్పింది నిజమే! పుట్టే ప్రతి వెయ్యిమంది శిశువుల్లో ఒక్కరి నుంచి ముగ్గురికి పుట్టుకతోనే వినికిడి లోపం ఏర్పడే రిస్క్ ఉంటుంది. ప్రధానంగా మీ విషయంలో మీవారి తమ్ముడికి అలాంటి ఇబ్బంది ఉందని మీరే చెబుతున్నారు. తప్పకుండా.. మీరు ఈ విషయాన్ని మీ డాక్టర్‌కు, ముఖ్యంగా బేబీ పుట్టిన తర్వాత పరీక్షించే పీడియాట్రీషియన్‌కు చెప్పడం ముఖ్యం. వారు వెంటనే హియరింగ్ స్క్రీనింగ్ చేస్తారు. అంటే.. వినికిడి లోపం ఉన్నదా? లేదా? అనేది తెలుసుకునేందుకు చేసే పరీక్ష. ఇది తప్పకుండా చేయించాలి. ఈ సమయంలోనే ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తిస్తే.. వైద్యులు వెంటనే తగిన చికిత్స ప్రారంభిస్తారు. దాంతో బిడ్డ వినికిడి లోపాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.
మీ విషయంలోనే కాకుండా, ప్రతి ఒక్కరూ బిడ్డ పుట్టిన వెంటనే సార్వత్రిక వినికిడి పరీక్ష (యూనివర్సల్ హియరింగ్ స్క్రీనింగ్) చేయించడం ముఖ్యం. ఎందుకంటే, ఎవరికైనా సరే మనం తొలిదశలోనే వినికిడి సమస్యను గుర్తించినట్టయితే, వెంటనే చికిత్స ప్రారంభించి, వారు జీవితాంతం చెవిటి – మూగ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. భాష అనేది వినికిడిపైనే ఆధారపడి ఉంటుంది. మనం వినలేకపోతే.. మాట్లాడలేం కూడా! కాబట్టి, పుట్టిన నెలలోపే బిడ్డకు వినికిడి సమస్యకు సంబంధించిన పరీక్ష చేయించాలి. రెండు నెలలలోపు సమస్యను నిర్ధారించి, మూడు నెలల వరకు సరైన చికిత్స అందించాలి. అయితే, చాలావరకు తల్లిదండ్రులు.. ‘మా పిల్లవాడు ఉలిక్కి పడుతున్నాడు. చుట్టు పక్కలయ్యే శబ్దాలకు ప్రతిస్పందిస్తున్నాడు. హియరింగ్ స్క్రీనింగ్ అవసరం లేదు!’ అనుకుంటారు.
అది కరెక్ట్ కాదు. బయటి చప్పుళ్లకు బిడ్డ ఉలిక్కిపడుతున్నా.. పూర్తిగా ఏ సమస్యా లేదని మనకు మనమే నిర్ణయించలేం. హియరింగ్ స్క్రీనింగ్ చేయించడం తెలివైన పని. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. దాన్ని కనిపెట్టినట్లయితే, ఆ బిడ్డకు కొత్త జీవితం ఇచ్చినవాళ్లం అవుతాం. మీ విషయంలో ఏమాత్రం అవకాశం తీసుకోకండి. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఈ హియరింగ్ పరీక్షలు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే, ప్రైవేట్‌గానైనా చేయించుకోవడం మంచిది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

