Grey Hair : జుట్టు రంగు మారుతోందా? టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది
జుట్టు రంగు మారుతోందా? టెన్షన్ పడకండి | చాలామందిని వేధించే సమస్య జుట్టు. ముఖ్యంగా యువతీయువకులు.. జుట్టు రంగు మార్పుపై చాలా ఆందోళన చెందుతుంటారు.
చాలామందిని వేధించే సమస్య జుట్టు. ముఖ్యంగా యువతీయువకులు.. జుట్టు రంగు మార్పుపై చాలా ఆందోళన చెందుతుంటారు. యుక్త వయసులోనే చాలామంది జుట్టు గ్రే కలర్లోకి మారిపోతుంటుంది. వయసు మీద పడితే జుట్టు రంగు మారితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ.. యుక్త వయసులో ఉన్న యువతకు నిండా 20 ఏళ్లు కూడా నిండకముందే.. జుట్టు రంగులు మారితే.. వాళ్ల పరిస్థితి వర్ణణాతీతం. అయితే.. చాలామందిలో జుట్టు రంగు గ్రే కలర్లో మారడానికి అసలు కారణాలేంటో పరిశోధకులు తెలుసుకున్నారు. అసలు.. జుట్టు గ్రే కలర్లోకి మారితే.. దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేమా? జట్టు నల్లగా, ఒత్తుగా మారాలంటే ఏం చేయాలి? గ్రే కలర్లోకి మారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది జుట్టుకు హెయిర్ డైలను వేసుకుంటారు. దాని వల్ల.. జుట్టు గ్రే కలర్లోకి మారుతుంది అని అపోహ పడుతుంటారు. హెయిర్ డైల వల్ల జుట్టు రంగు మారడం నిజమే అయినప్పటికీ.. అది శాశ్వతం కాదు. కొన్ని రోజుల వరకే హెయిర్ అలా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత హెయిర్ పూర్వరంగుకు మారాల్సిందే. కానీ.. అసలు గ్రే కలర్లోకి శాశ్వతంగా జుట్టు మారడం అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయమే.
ఒత్తిడే గ్రే కలర్ జుట్టుకు కారణమా?
ఈరోజుల్లో చాలామంది బాగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగం వల్ల కావచ్చు.. ఫ్యామిలీ సమస్యల వల్ల కావచ్చు.. ఇతర ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు.. ఎవరైతే తీవ్రంగా ఒత్తిడికి లోనవుతారో.. వాళ్లలో ఈ జుట్టు రంగు సమస్యలు తలెత్తుతాయి. చిన్నవయసు అయినా పెద్ద వయసు అయినా.. ఒత్తిడి ఎక్కువైతే.. జుట్టు రంగు మారుతుంది. కొందరికి గ్రే రంగులోకి మారుతుంది. మరికొందరి జుట్టు ఏకంగా తెల్లగా అవుతుంది. దానికి కారణం అధిక ఒత్తిడే.

ఒకవేళ చిన్నవయసులోనే జుట్టు రంగు సమస్యలతో సతమతమయ్యేవారు.. ఒత్తిడిని జయిస్తే చాలు.. జుట్టు రంగు కూడా తిరిగి పూర్వస్థితికి వస్తుందని రీసెర్చర్స్ చెబుతున్నారు. కొలంబియా యూనివర్సీటికి చెందిన రీసెర్చర్స్ జుట్టు రంగు మార్పిడి మీద పరిశోధన చేశారు. కొందరిపై పరిశోధన చేసి.. వాళ్లలో ఒత్తిడిని పెంచి చూశారు.. దీంతో వాళ్ల జుట్టు రంగు మారడం గమనించారు. ఆ తర్వాత కొందరిని వెకేషన్‌కు పంపించి.. ఒత్తిడిని తగ్గించేలా.. వాళ్లు రిలాక్స్ అయ్యేలా చేశారు. కొన్ని రోజులకే గ్రే రంగులో ఉన్న వెంట్రుకలు కాస్త.. డార్క్‌గా మారడం వాళ్లు గమనించారు.

అయితే.. దశాబ్దాల పాటు.. జుట్టు రంగు గ్రేగా ఉంటే మాత్రం కేవలం ఒత్తిడి తగ్గించి.. రంగును మార్చడం కుదరదని.. యుక్త వయసు, మధ్య వయసులోని వారికి ఇటువంటి సమస్యలు ఉంటే.. వాళ్లకు మాత్రం ఒత్తిడిని తగ్గించి.. వాళ్ల జుట్టు రంగును యథాస్థితికి తీసుకురావచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Health Tips | మీకు పల్లీలు తినే అలవాటు ఉందా? అయితే మీరు లక్కీ.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
మైగ్రేన్ (పార్శపు తలనొప్పి) వేధిస్తున్నదా?
Fish Eggs: చేపల్లో గుడ్లు వస్తే పడేస్తున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

