ఆ బాధ తగ్గేదెలా?
నాకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. ఉద్యోగరీత్యా ఏడాదిన్నరగా మేమిద్దరం దూరంగా ఉంటున్నాం. ఆరు నెలల నుంచీ నా వ్యక్తిగత భాగాల్లో విపరీతంగా దురద వస్తున్నది.
నాకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. ఉద్యోగరీత్యా ఏడాదిన్నరగా మేమిద్దరం దూరంగా ఉంటున్నాం. ఆరు నెలల నుంచీ నా వ్యక్తిగత భాగాల్లో విపరీతంగా దురద వస్తున్నది. ఆ సమయంలో కోసుకుపోయినట్టు అనిపిస్తుంది. నీళ్లు తగిలినా మంటగా ఉంటుంది. దురదతోపాటు తరకలుగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నది. ఫంగల్ ఆయింట్మెంట్లు వాడినా ఫలితం కనిపించడం లేదు. ఎవరికైనా చెప్పాలంటేనే సిగ్గుగా ఉంది. దయచేసి, మంచి మందులు సూచించండి.
వ్యక్తిగత భాగాల్లో దురద ఉందని అంటున్నారు కాబట్టి, ముందుగా షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఆ ఇబ్బందికి ఇదీ ఒక కారణం కావచ్చు. అలాగే మీరు, మీ వారు ఈ ఏడాదిన్నరలో కలిశారా లేదా అన్నదీ ముఖ్యమే. ఒక వేళ కలిసి ఉంటే, ఆయన్ని కూడా షుగర్ టెస్ట్ చేయించుకోమని చెప్పండి. ఇద్దరిలో ఏ ఒక్కరికి మధుమేహం ఉన్నా ఈ సమస్య తలెత్తవచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఆ భాగాల్లో డెటాల్లాంటి యాంటీ సెప్టిక్ మందులు పూయకూడదు. అయినా ఇదేమంత ప్రమాదకరం కాదు.
సిగ్గుపడాల్సిన విషయమూ లేదు. మంచి గైనకాలజిస్టును లేదా డెర్మటాలజిస్టును సంప్రదిస్తే యాంటీ ఫంగల్ మాత్రలు ఇస్తారు. దురద తగ్గేందుకు కొన్ని నియమాలు చెబుతారు.
-(వైద్య నిపుణుల సలహా కోసం మహిళా పాఠకులు తమ సమస్యల్ని zindagi@ntnews.com కు మెయిల్ చేయవచ్చు)
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

