Vitamin D | చలికాలంలో విటమిన్ డీ లోపాన్ని అధిగమించాలంటే..!
Vitamin D : వింటర్లో సూర్యరశ్మి తగలకపోవడంతో ప్రజలు డీ విటమిన్ సరిగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. డీ విటమిన్ లోపంతో కీళ్ల నొప్పులు, వాపు, కుంగుబాటు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
Vitamin D : వింటర్లో సూర్యరశ్మి తగలకపోవడంతో ప్రజలు డీ విటమిన్ సరిగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. డీ విటమిన్ లోపంతో కీళ్ల నొప్పులు, వాపు, కుంగుబాటు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వారానికి కనీసం రెండుసార్లు 10 నుంచి 30 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో విటమిన్ డీ పొందడంలో ఇబ్బందులతో శరీరం క్యాల్షియమ్, ఫాస్పరస్‌ను గ్రహించే శక్తిని కోల్పోవడంతో ఎముకలు, కండరాల నొప్పులు బాధిస్తుంటాయి.
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయే క్రమంలో బయటి వాతావరణంలో గడిపే సమయం తగ్గుతుంటుందని దీంతో విటమిన్ డీ లెవెల్స్ తగ్గుతాయని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ జీ కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు. విటమిన్ డీతో ఎముకల బలోపేతంతో పాటు ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలను కాపాడేలా కండరాలను పటిష్టం చేస్తుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ గౌరవ్ ప్రకాష్ భరద్వాజ్ చెప్పారు.
అధిక సమయం ఇంటిపట్టునే ఉండేవారు సహజమైన వెలుగు పడేలా విండోస్ వద్ద ఉండేలా చూసుకోవాలని, దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పించాలని డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. ఇక గుడ్డు, పోర్టిఫైడ్ డైరీ ఉత్పత్తులు, చేపలు, మష్రూమ్స్ వంటి విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి ఆహారం తీసుకోలేని వారు వైద్యుల సలహాతో విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను క్రమం తప్పకుండా వాడాలని సూచించారు.
Read More :
Coronavirus | 4 వేల దిగువకు క్రియాశీల కేసులు.. 24 గంటల్లో 475 మందికి పాజిటివ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

