Healthy Heart | గుండె ఆరోగ్యం కోసం రోజుకు ఎంత సాల్ట్ తీసుకోవాలంటే..!
Healthy Heart | ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. గత కొన్నేండ్లుగా యువతతో పాటు పెద్దల్లో హృద్రోగాలు గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Healthy Heart | ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. గత కొన్నేండ్లుగా యువతతో పాటు పెద్దల్లో హృద్రోగాలు గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. శారీరక వ్యాయామం లేకపోవడం, ప్రాసెస్డ్ ఆహారపదార్ధాలు అధికంగా తీసుకోవడం, పొగతాగడం, అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి.
మనం తీసుకునే ఆహారం కూడా గుండెపై పలురకాలుగా పెను ప్రభావం చూపుతుంది. రోజూ అధికంగా ఉప్పు వాడకం గుండెపై ప్రభావం చూపడంతో పాటు ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. శరీరం విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు సాల్ట్‌లో ఉండే సోడియం కీలకమైన మినరల్ కాగా, దీన్ని అధికంగా తీసుకుంటే బీపీ, బరువు పెరగడంతో పాటు కడుపుబ్బరం, వాపు వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇది గుండె, కిడ్నీల పనితీరునూ దెబ్బతీస్తుంది. రోజుకు 2300 మిల్లీగ్రాములు అంటే 5 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ సూచిస్తోంది.
ఇక బీపీతో బాధపడేవారు రోజుకు 1500 మిల్లీగ్రాములు మించి సోడియం తీసుకోకూడదు. అంటే రక్తపోటు బాధితులు రోజుకు ఒక టీస్పూన్ కంటే తక్కువ సాల్ట్‌ను తీసుకోవాలి. సాల్ట్‌ను తగ్గించుకోవాలంటే సోడియం తక్కువగా ఉన్న ఆహారపదార్ధాలను తీసుకోవాలి. ఆహారపదార్ధాలపై లేబుల్స్‌ను పరిశీలించి సోడియం తక్కువగా ఉన్న పదార్ధాలను ఎంపిక చేసుకోవాలి. పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవాలి. సోడియం ప్రభావాన్ని తగ్గించే పొటాషియంతో కూడిన అరటిపండ్లు, బంగాళాదుంపలు, పాలకూర, పుచ్చకాయ, బీట్రూట్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
Read More :
Hyderabad | భాగ్యనగరి గొంతెండుతోంది.. తాగునీటి కోసం నగరవాసుల తండ్లాట
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- bp
- Healthy heart
- salt
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

