High Blood Pressure Diet | హైబీపీ ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆహారాలను తినకూడదు.. లేదంటే ప్రమాదమే..!
హైబీపీ సమస్యతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే హైబీపీ వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు.
High Blood Pressure Diet | హైబీపీ సమస్యతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే హైబీపీ వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, మద్యం అధికంగా సేవించడం, ధూమపానం చేయడం వంటివి హైబీపీ వచ్చేందుకు కారణం అవుతున్నాయి. అయితే హైబీపీ ఉన్నవారు కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. డాక్టర్ సూచించే మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. దీని వల్ల బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వీటిని తినకూడదు..
హైబీపీ ఉన్నవారు కచ్చితంగా ఉప్పును పూర్తిగా తగ్గించాలి. లేదా మానేస్తే ఇంకా మంచిది. దీని వల్ల బీపీ కనీసం 5 నుంచి 10 పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఉప్పును తక్కువగా తీసుకోవడంతోపాటు ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క సూచన పాటిస్తే వారంలోనే తేడాను గమనించవచ్చు. కచ్చితంగా బీపీ గణనీయంగా తగ్గుతుంది. అలాగే హైబీపీ ఉన్నవారు టీ, కాఫీలను తాగడం పూర్తిగా తగ్గించాలి. రోజూ కప్పుల కొద్దీ టీ, కాఫీలను తాగే అలవాటు ఉన్న హైబీపీ పేషెంట్లు కచ్చితంగా మోతాదును పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీ, కాఫీల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది బీపీని కాసేపు పెంచుతుంది. కనుక సాధారణ వ్యక్తులకు ఏమీ అవదు. కానీ హైబీపీ ఉన్నవారికి మాత్రం ఇది చేటు చేస్తుంది. కనుక హైబీపీ పేషెంట్లు టీ, కాఫీలను అధికంగా తాగే అలవాటు ఉంటే వాటిని తగ్గించాలి. అందుకు బదులుగా హెర్బల్ టీలను తాగితే మేలు జరుగుతుంది.
వీటికి కూడా దూరంగా ఉండాలి..
హైబీపీ ఉన్నవారు ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రాజెన్ ఫుడ్స్, పిజ్జాలు వంటి ఆహారాల జోలికి వెళ్లకూడదు. ఇవి హైబీపీ ఉన్నవారికి అసలు ఏమాత్రం మంచివి కావు. వీటిల్లో చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ బీపీ పెరిగేందుకు కారణం అవుతాయి. కనుక వీటిని ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. అలాగే బిస్కెట్లు, కుకీస్, కేక్స్, పై, డో నట్స్, చిప్స్, క్రాకర్స్, మైక్రోవేవ్ పాప్ కార్న్ వంటి బేకరీ ఉత్పత్తులను సైతం తినకూడదు. వీటిల్లో సోడియం, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బీపీ ఉన్నవారికి చేటు చేస్తాయి. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు ఈ ఆహారాలను కూడా తినకూడదు. ఇక బీపీ ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించకూడదు. పొగ తాగకూడదు. వీటి వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా హైబీపీ ఉన్నవారు ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
వీటిని తీసుకోవాలి..
ఇక హైబీపీ ఉన్నవారు పండ్లు, కూరగాయలను అధికంగా తినాల్సి ఉంటుంది. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించేందుకు సహాయం చేస్తాయి. బెర్రీలు, అరటి పండ్లు, పాలకూర, చిలగడదుంపలు, బీట్ రూట్ వంటి వాటిల్లో ఆయా పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వాటిని తింటుంటే మేలు జరుగుతుంది. అలాగే ఓట్ మీల్, బ్రౌన్ రైస్, కినోవా, కొవ్వు లేని పెరుగు, చేపలు, బీన్స్, పప్పు దినుసులు, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్ వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. హైబీపీ ఉన్నవారు ఇలా ఆహారాల విషయంలో మార్పులు చేసుకుంటే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

