Arteries | మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అధిక రక్తపోటుతో పాటు గుండె సంబంధిత సమస్యలు, ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్యలు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కనుక ఈ సమస్యల బారి నుండి బయటపడడంతో పాటు ఈ సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల మనం ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
అలాగే సహజంగా మన ఇంట్లోనే కొన్ని రకాల పానీయాలను తయారు చేసి తీసుకోవడం వల్ల ధమనులు మూసుకుపోకుండా చేయవచ్చు. తద్వారా రక్తపోటు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధమనులు మూసుకుపోకుండా ఉండడానికి వైద్యులు సిఫార్సు చేసిన పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్, నిమ్మకాయలను కలిపి జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్రూట్ ను ఉడికించి దాని నుండి రసాన్ని తీయాలి. దీనికి తగినంత నీరు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ధమనుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక కప్పు నీటిలో 3 లేదా 4 ఎండిన మందార రెమ్మలు వేసి రంగు మారే వరకు వేడి చేయాలి. తరువాత వడకట్టి తేనె లేదా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బ్లెండర్ లో రోల్డ్ ఓట్స్, పెరుగు, బెర్రీలు వేసి స్మూతీలా చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. గుండెకు మేలు కలుగుతుంది. గ్రీన్ టీ లో పుదీనా ఆకులు, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.
నీటిలో నారింజ ముక్కలు, అల్లం, పుదీనా కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే శరీరానికి తగినంత పొటాషియం అందడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇటువంటి పానీయాలను ఆహారంలో భాగంగా తీసుకుంటూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ధమనులు మూసుకుపోకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శరీరానికి మేలు కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.