కీళ్లనొప్పా.. ఇవి తినండి!
మోకీళ్ల నొప్పులు ఉంటే కూర్చోవడం, కూర్చుంటే లేవడం రెండూ కష్టమైపోతాయి. ఈ సమస్యకు యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్ ప్రధాన కారణాలు. నొప్పి మూలంగా తరచుగా కీళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది.
మోకీళ్ల నొప్పులు ఉంటే కూర్చోవడం, కూర్చుంటే లేవడం రెండూ కష్టమైపోతాయి. ఈ సమస్యకు యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్ ప్రధాన కారణాలు. నొప్పి మూలంగా తరచుగా కీళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది. అయితే, కీళ్లనొప్పి, వాపు నుంచి విముక్తి పొందడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి వాపు, నొప్పిని తగ్గించడమే కాకుండా బలహీనమైన ఎముకలను పటిష్ఠం చేస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వెల్లుల్లి: ఆహారం రుచిని పెంచే వెల్లుల్లి కీళ్లనొప్పి విషయంలో గొప్ప ప్రయోజనమే చేకూరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పి, వాపును తగిస్తాయి. వెల్లుల్లి పేస్టును నూనెలో వేడిచేసి, దాన్ని కీలుమీద రుద్దితే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. రోజూ ఓ వెల్లుల్లి రెమ్మ ఆహారంగా తీసుకున్నా మంచిదే. వెల్లుల్లి తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వాపు తగ్గిపోతుంది.
పసుపు: దీనిలో ఉండే కర్క్యుమిన్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. గాయాలు అయినప్పుడు పసుపు ముద్ద పెడితే వాపు, నొప్పి నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తీసుకుంటే కూడా కీళ్లనొప్పి తగ్గడంలో ప్రయోజనకారిగా ఉంటుంది.
దాల్చినచెక్క: ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కీళ్లనొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా కీళ్ల మధ్య ఒరిపిడిని కూడా తగ్గిస్తుంది.

అల్లం: దీనిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజరాల్ కీళ్ల దగ్గర వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది.

బెర్రీలు: వీటిలో యాంథోసయనిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

