Tea | 30 రోజులు టీ తాగడం మానేస్తే ఏమవుతుంది.. శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులివే!
Tea | టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఒక 30 రోజులు చాయ్‌కు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలను పరిశీలిద్దాం..
Tea | చాయ్.. పానీయం మాత్రమే కాదు. జీవితంలో ఒక భాగం కూడా. అయితే మన ఆరోగ్యం విషయంలో ఎదురయ్యే సమస్యలకు టీ కూడా ఒక కారణమని చాలామందికి తెలియదు. టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఒక 30 రోజులు చాయ్‌కు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలను పరిశీలిద్దాం..
30 రోజులు టీ మానేస్తే శరీరం అద్భుతమైన రీబూట్ ప్రక్రియకు లోనవుతుంది. ఈ మార్పు బాహ్య సౌందర్యానికే కాకుండా శరీరంలోని ప్రతి కణాన్నీ పునరుజ్జీవింపజేస్తుంది. ముఖంపై సహజమైన కాంతి రావడం నుంచి, మొండి మొటిమలు, మచ్చలు తగ్గడం వంటి మార్పులెన్నో చోటుచేసుకుంటాయి. కళ్ల కింద నలుపు మాయమై, ముఖం యవ్వనంగా మారుతుంది. లోలోపల అవయవాలు కూడా మరింత చురుగ్గా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, మంచి నిద్రపట్టడంతోపాటు తెలియకుండానే మనలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.
టీలో ఉండే కెఫీన్ మన శరీరం నుంచి నీటిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. కాబట్టి టీ మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉండి, చర్మకణాలకు తగిన తేమ అందుతుంది. తద్వారా ముఖం, బుగ్గలు తాజాగా మెరుస్తూ ఉంటాయి. టీ వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు, దురద, వాపు, గుల్లలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. టీ మానేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా చకెర ఎకువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొలాజెన్, ఎలాస్టిన్ అనే ప్రొటీన్లు దెబ్బతింటాయి.
ఇక టీ మానేసి నీళ్లు, హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల లివర్, కిడ్నీలు చురుగ్గా పనిచేసి, రక్తాన్ని సమర్థంగా శుద్ధి చేస్తాయి. టీలో మనం కలిపే పాలు, చకెర మొటిమలకు మంచి మిత్రులు. చకెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఒకసారిగా పెరుగుతుంది. ఇది చర్మంలోని నూనె గ్రంథులను ప్రేరేపించి ముఖంపై ఎకువ నూనె ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి.
ఇక పాలలోని హార్మోన్లు మొటిమలను ప్రేరేపిస్తాయి. టీ మానేయడం వల్ల నూనె ఉత్పత్తి తగ్గి కొత్త మొటిమలు రావడం నెమ్మదిస్తుంది. కళ్ల కింద నలుపు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. టీలో ఉండే కెఫీన్ నిద్రను కలిగించే మెదడులోని అడెనోసిన్‌ను అడ్డుకుంటుంది. టీ మానేయడం వల్ల శరీరం సహజమైన నిద్ర సైకిల్‌కు చేరుకుంటుంది. గాఢ నిద్ర పట్టడం వల్ల కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. ఫలితంగా కళ్ల కింద డార్క్నెస్, కళ్ల కింద వాపు కూడా తగ్గుతుంది.
అయితే ఒక్కసారిగా టీ మానేస్తే మొదటి వారం రోజులు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తేలికపాటి తలనొప్పి, నీరసం, చిరాకు ఉండొచ్చు. అలాంటప్పుడు నెల రోజుల పాటు టీకి బదులుగా గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికిపోయి సత్ఫలితాలు పొందగలుగుతారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

