చెవిలో కనుక.. గులిమి వస్తే?
డాక్టర్ గారూ! మా బాబు వయసు పదేండ్లు. వాడికి తరచూ చెవిలో గులిమి వస్తున్నది. ఆ దుర్వాసన ఇబ్బందిగా అనిపిస్తుంది.
డాక్టర్ గారూ! మా బాబు వయసు పదేండ్లు. వాడికి తరచూ చెవిలో గులిమి వస్తున్నది. ఆ దుర్వాసన ఇబ్బందిగా అనిపిస్తుంది. బడిలో తోటి పిల్లలు తనను చూసి నవ్వుతున్నారని ఫిర్యాదు చేస్తున్నాడు. ఆ భయంతో పెన్సిల్, పెన్ను ఏది పడితే అది చెవిలో పెట్టుకుంటున్నాడు. మీరే ఓ పరిష్కారం చెప్పాలి.
– ఓ సోదరి
చిన్నపిల్లల్లో వచ్చే చెవికి సంబంధించిన సమస్యలలో గులిమి ఒకటి. వాతావరణంలోని దుమ్ము, ధూళి చెవిలోకి ప్రవేశించకుండా నివారించే జిగురు లాంటి పదార్థమిది. చర్మంలోని చెమట గ్రంథుల నుంచి ఇది స్రవిస్తుంది. చెమట లాగానే కొందరిలో మరీ ఎక్కువ. ఉండలు ఉండలుగా బయటికొస్తుంది. దవడల కదలికల వల్ల దానంతట అదే బయటపడుతుంది. కాబట్టి, ప్రత్యేకించి బడ్స్ ఉపయోగించరాదు. బడ్స్ వాడితే గులిమి ఇంకా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కర్ణభేరికి గాయం కావచ్చు. గులిమి ఎక్కువగా ఏర్పడి, బాగా గట్టిపడి బయటికి రాకుండా చెవిలో అడ్డుపడినప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చెవి మూసుకుపోయినట్టు ఉంటుంది.
తాత్కాలికంగా చెవుడు ఏర్పడుతుంది. చెవిలో వింత శబ్దాలు వస్తాయి. తల తిరిగినట్టు, పడిపోతున్నట్టు అనిపిస్తుంది. దగ్గు ఇబ్బంది పెడుతుంది. చెవిలో నీళ్లు ప్రవేశిస్తే కనుక.. ఆ నీటిలో గులిమి నానిపోయి ఉబ్బిపోతుంది. దీనివల్లా సమస్యలు వస్తాయి. గులిమి గట్టిపడి లోపలే నిలిచి పోయినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. మెత్తబడటానికి మందులు వాడి, ఆ తర్వాత ‘సిరంజింగ్’ విధానంతో శుభ్రం చేస్తారు. కొన్నిసార్లు ‘సెరుమెన్ హుక్’ అనే పరికరాన్నీ వాడతారు. ఇలాంటి సమస్యలు చిన్నారులలో ఆత్మన్యూనతను కలిగిస్తాయి. కాబట్టి, వెంటనే నిపుణులను సంప్రదించండి.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు సికింద్రాబాద్.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

