కాలేయాన్ని కాటేస్తున్న హెపటైటిస్‌లు
కాలేయం మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి. జీవక్రియలో కీలకపాత్ర పోషించడమే కాకుండా 500 రకాలకు పైగా జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అంతేకాదు, పునరుత్పాదక శక్తి కలిగిన ఏకైక అవయవం కాలేయం.
కాలేయం మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి. జీవక్రియలో కీలకపాత్ర పోషించడమే కాకుండా 500 రకాలకు పైగా జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అంతేకాదు, పునరుత్పాదక శక్తి కలిగిన ఏకైక అవయవం కాలేయం. దీనిని వైద్య పరిభాషలో హెపటో లేదా హెపాటిక్ అనే గ్రీకు పదాలతో పిలుస్తారు. కాలేయం సుమారు 1.5 కిలోల బరువు ఉంటుంది.
హెపటైటిస్:
విష తుల్యమైన పదార్థాల వల్ల, కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావంపడి అది వాపునకు గురవుతుంది. ఈ సమస్యనే హెపటైటిస్ అంటారు. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్లు కాలేయాన్ని హెపటైటిస్‌కు గురిచేస్తాయి.
బి, సి వైరస్లు మరీ ప్రమాదకరం:
హెపటైటిస్ వైరస్లలో బి, సి రకాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి రక్తమార్పిడి వల్ల, అరక్షిత శృంగారం ద్వారా తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం అధికం. హెపటైటిస్-బి సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే హెపటైటిస్-బి పాజిటివ్ ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వ్యాక్సిన్ వేయించుకునే ముందు టెస్ట్ చేయించుకుని నెగిటివ్ ఉంటే, ఏ వయసులోనైనా టీకా వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం వేయించడం ఉత్తమం. ఇక హెపటైటిస్-సికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త…
ఆకలి మందగించడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. నాటువైద్యం జోలికి వెళ్తే మొదటికే మోసం. లివర్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్, లివర్ అబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధ వ్యాధులున్నా.. వీటిలో హెప టైటిస్-బి, సి వైరస్లు కలిగించే ఇన్ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తరువాత కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. కాలేయాన్ని గట్టిగా మార్చేసి(సిరోసిస్), తరువాత కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.
కాలేయ క్యాన్సర్లు రెండు రకాలు:
కాలేయ క్యాన్సర్లను ప్రధానంగా రెండు రకాలుగా పరిగణిస్తారు. అందులో ఒకటి హెపటుసెల్యులార్ కార్సినోమా. ఇది కాలేయంలో నుంచి వస్తుంది. రెండోది మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్. శరీరంలోని ఇతర భాగాలలో మొదలైన క్యాన్సర్ కాలేయానికి వ్యాప్తి చెందుతుంది.
ఈ క్యాన్సర్లు కాలేయానికి వ్యాపిస్తాయి:
జీర్ణవ్యవస్థలోని చాలా రకాల క్యాన్సర్లు కాలేయానికి వ్యాపిస్తాయి. వీటితోపాటు రొమ్ము క్యాన్సర్, ఎముకల క్యాన్సర్లు కూడా కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. ఆలస్యంగా బయటపడే కాలేయ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైంది.
ప్రధాన కారణం హెపటైటిస్-బి:
భారత్, చైనా, హాంకాంగ్, తైవాన్, కొరియా, దక్షిణాఫ్రికాల్లో హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ల వల్లే కాలేయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టుకతో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ 30 లేదా 40 సంవత్సరాలలో లక్షణాలు బయటపడటం, క్యాన్సర్ బారినపడటం గమనించవచ్చు.
పురుషులలో అధికం:
కాలేయ క్యాన్సర్ మహిళలతో పోలిస్తే పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగం త్వరగా ముదిరి, చికిత్సకు లొంగదు.
కాలేయ క్యాన్సర్ ముదిరిన దశలో లక్షణాలు:
- కడుపులో నొప్పి
- వాంతులు
- వికారం
- ఆకలి మందగించడం
వ్యాధి దశ నిర్ధారణ పరీక్షలు:
హెపటైటిస్-బి లేదా హెపటైటిస్-సి ఉన్నవారు రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్ స్థాయులు, క్యాల్షియం, కొలెస్ట్రాల్ స్థాయులను, ఆల్ఫాఫీటా ప్రొటీన్(ఏఎఫ్‌పీ) తదితరాలను తెలిపే రక్త పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్, వైద్యుల సలహా మేరకు సీటీ, ఎంఆర్ఐ, పెట్-స్కాన్, లివర్ బయాప్సి తదితర టెస్టులతో కాలేయ క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.
చికిత్స పద్ధతులు:
కాలేయంలో ఏర్పడిన కణితి పరిమాణం, అది ఏర్పడిన ప్రదేశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఈ క్యాన్సర్ పెరిగే విధానం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే కణితి రెట్టింపైతే, మరికొందరిలో సంవత్సరానికి పైగా సమయం తీసుకోవచ్చు. కణితిని చిన్న పరిమాణంలో ఉన్నప్పుడే గుర్తించినా అది లివర్ సిరోసిస్‌కు గురికావడం వల్ల సర్జరీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కీమో థెరపీ, ట్రాన్స్ ఆర్టిరియల్ కీమో ఎంబోలైజేషన్, రేడియో అబ్లేషన్, ప్రోటాన్ బీమ్ థెరపీ, బయోథెరపీ, కీమో అబ్లేషన్, స్టీరియో టాక్టర్ రేడియో సర్జరీ వంటి పద్ధతులతో కణితిని తొలగించవచ్చు లేదా పరిమాణాన్ని తగ్గించవచ్చు. కాలేయంలో ఏర్పడిన కణితి చిన్న సైజులో ఉండి, కాలేయ ఇతర భాగం బాగానే ఉంటే శస్త్రచికిత్సనే ఉత్తమం. కణితి సైజు పెద్దగా ఉన్నా లేక ఎక్కువ సంఖ్యలో కణుతులు ఉన్నా, కాలేయం విఫలమయ్యే దశలో ఉన్నా కాలేయ మార్పిడి తప్పనిసరి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

