Health Tips | ఈ మూలికను తింటే 60 ఏళ్ల వృద్ధుడు కూడా 30 ఏళ్ల యువకుడిలా..!
Health Tips | పాత కాలం మనుషులు చాలా దృఢంగా ఉండేవారు. ఎవరికీ బీపీ, షుగర్, గుండె జబ్బులు లాంటి సమస్యలు పెద్దగా ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో అహారపు అలవాట్లు, ఉరుకులు, పరుగుల జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు.
Health Tips : పాత కాలం మనుషులు చాలా దృఢంగా ఉండేవారు. ఎవరికీ బీపీ, షుగర్, గుండె జబ్బులు లాంటి సమస్యలు పెద్దగా ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో అహారపు అలవాట్లు, ఉరుకులు, పరుగుల జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఏ పని చేసినా ఊరికినే అలసిపోతారు. అలాంటి సమస్యకు ఒక సహజ మూలికతో చెక్ పెట్టవచ్చు. ఆ మూలికను తింటే 60 ఏళ్ల వృద్ధుడు కూడా 30 ఏళ్ల యువకుడిలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా మారుతారు. మరి ఆ మూలిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోండ్ కటిర (Gond Katira)..! ఇది సహజసిద్ధంగా లభ్యమయ్యే ఒక ఆయుర్వేద మూలిక. శారీరక బలహీనతతో బాధపడుతున్న వారికి ఈ మూలిక చక్కటి పరిష్కారం చూపుతుంది. ఆయుర్వేదంలో ఈ మూలికకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ఎముకలను పటిష్టం చేస్తుంది. మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ‘గోండ్ కటిర’ మూలికను తింటే నిద్ర చక్కగా పడుతుంది.
ఇది గ్రామీణ ప్రాంతాల్లో అయితే సహజంగా లభిస్తుంది. పట్టణాల్లో అయితే స్థానిక మార్కెట్లు లేదా ఆయుర్వేద మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. గోండ్ కటిర అనేది గమ్‌లా కనిపించే ఒక సహజమైన పదార్థం. ఈ పదార్థం లోకోవీడ్ అనే ఒక రకమైన మొక్క నుంచి వస్తుంది. చూసేందుకు పసుపు రంగులో కనిపిస్తుంది. పటిక బెల్లంలా ఉంటుంది. అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా గోండ్ కటిరను కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆయుర్వేద ఔషధంలో చలువచేసే గుణాలు కూడా ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు గోండ్ కటిర జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీ శరీరంలోని నీటి శాతాన్ని పెంచి, అధిక చెమటను తగ్గిస్తుంది. సమ్మర్ డ్రింక్స్‌లో కూడా గోండ్ కటిరను యాడ్ చేసుకోవచ్చు. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. వృద్ధాప్య ఛాయలు, ముఖంపై మచ్చలు, డల్ స్కిన్ తదితర సమస్యలను ఇది తగ్గించగలదు. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారం.
గోండ్ కటిరను తీసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. గోండ్ కటిరను రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. దాంతో తెల్లటి జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీని నిమ్మరసం, చక్కెర, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాలు, పుదీనా లాంటి వాటిలో కలుపుకొని తినవచ్చు. నానబెట్టిన గోండ్ కటిరను ఫ్రెష్ వెజిటెబుల్ సలాడ్స్‌లో కలుపుకుని కూడా తినవచ్చు.
గోండ్ కటిర జెల్లీని ఫేస్ మాస్క్‌లా కూడా వాడవచ్చు. రోజూ గోండ్ కటిర తింటే శారీరక బలహీనత సైతం తగ్గుతుంది. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ గోండ్ కటిర సహజమైన ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తూ మొత్తం శారీరాన్ని ఎనర్జిటిక్‌గా మారుస్తుంది. అయితే ఈ గోండ్ కటిరను వాడే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

