Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందట.. నిపుణులు ఏమంటున్నారంటే..!
Health Tips | డ్రై ఫ్రూట్స్ (Dry froots) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం ఈ రోజుల్లో అందరికీ తెలుసు. బాదం (Almonds), జీడిపప్పు, వాల్నట్స్ (Wall Nuts), ఖర్జూరం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని సరైన విధంగా తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Health Tips : డ్రై ఫ్రూట్స్ (Dry froots) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం ఈ రోజుల్లో అందరికీ తెలుసు. బాదం (Almonds), జీడిపప్పు, వాల్నట్స్ (Wall Nuts), ఖర్జూరం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని సరైన విధంగా తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతారు. ఇలా చేయడంవల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి, పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. రోజుకు సుమారు 20 నుంచి 30 గ్రాముల వరకు మాత్రమే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఎండు ఖర్జూరాలు, వాల్నట్స్, నానబెట్టని బాదంపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో వీటిని మితంగా తీసుకోవడం, వీలైతే నానబెట్టి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి, మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
నానబెట్టిన బాదంపప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరాలను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. అలాగే మఖానా (ఫాక్స్ నట్స్) ను తేలికైన, ఆరోగ్యకరమైన చిరుతిండిగా పరిగణిస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించే గుణాలు కలిగి ఉంటుందని చెబుతారు.
డ్రై ఫ్రూట్స్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని మితంగా, సరైన పద్ధతిలో, కాలానుగుణంగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మధుమేహం, అధిక బరువు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డ్రై ఫ్రూట్స్‌ను తమ నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

