Health Tips | బిర్యానీ లాంటి స్పైసీ ఫుడ్స్‌లో నిమ్మరసం పిండుకుంటున్నారా.. ఆరోగ్యం దెబ్బతింటుందట జాగ్రత్త..!
Health Tips | సాధారణంగా నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్‌కు గురైన బాడీని వెంటనే హైడ్రేట్ చేయడానికి నిమ్మరసాన్ని వినియోగిస్తుంటారు. పరగడుపునే నిమ్మరసంతో షర్బత్ చేసుకుని తాగితే కడుపులోని మలినాలు సులువుగా బయటికి పోతాయంటున్నారు.
సాధారణంగా నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్‌కు గురైన బాడీని వెంటనే హైడ్రేట్ చేయడానికి నిమ్మరసాన్ని వినియోగిస్తుంటారు. పరగడుపునే నిమ్మరసంతో షర్బత్ చేసుకుని తాగితే కడుపులోని మలినాలు సులువుగా బయటికి పోతాయంటున్నారు. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా నిమ్మ పులుపు తోడైతే ఆ ఆహారానికి కమ్మదనం వస్తుంది. కానీ, ఈ నిమ్మరసం కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిస్తే విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. మరి నిమ్మరసంతో కలపకూడని ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులతో నిమ్మరసాన్ని కలపగూడదు. ఏ రకమైన పాల ఉత్పత్తులతో కూడా నిమ్మకాయను కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పాలు, నిమ్మరసం ఒకేసారి తాగడం ఆరోగ్యానికి హానికరమని, దాంతో గుండెల్లో మంటగా అనిపించడం, వాంతులు అవడం లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా మసాలా వంటకాల్లో కూడా నిమ్మరసాన్ని ఉపయోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిర్యానీలు, ఇతర మసాలా ఆహారాల్లో ఘాటును భరించడం కోసం, పుల్లని రుచి కోసం చాలా మంది నిమ్మరసాన్ని పిండుకుంటారు. కానీ దానివల్ల ఎసిడిటీ బారినపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటమేగాక ఆ నిమ్మకాయ పిండుకోవడంవల్ల మసాలా ఘాటు తగ్గుతుంది. దాంతో అతిగా మసాలాను తీసుకుంటాం. ఇది ఎసిడిటీకి కారణమవుతుంది.
రెడ్ వైన్ తీసుకునేటప్పుడు కూడా నిమ్మకాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసం వైన్ రుచిని, వాసనను చెడగొట్టడమేగాక ఆరోగ్యానికి హాని చేస్తుందంటున్నారు. పెరుగు, చల్ల లాంటి పాల ఉత్పత్తులతో కూడా నిమ్మరసం తీసుకోవడం మంచిది కాదంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తులతో నిమ్మరసం జోడించడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు. శరీరంలో ఎసిడిటీని కలిగిస్తుందని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

