Health | ప్రొటీన్ సరిపోను అందాలంటే.. గర్భిణులు తినాల్సినవి
ప్రొటీన్ కోసం గర్భిణులు తినాల్సిన ఫుడ్
గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి ఏం ఫుడ్ తినాలి? ఎంత తినాలి? అనే సందేహాలు ఉంటాయి చాలామంది మహిళలకు. ప్రెగ్నెన్సీ టైంలో ప్రొటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. కండరాలు దృఢంగా ఉండేందుకు, చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రొటీన్ చాలా అవసరం. గర్భిణులు రోజుకు కనీసం 70 గ్రాముల ప్రొటీన్ అందేలా చూసుకోవాలి అంటున్నారు స్పోర్ట్స్ మెడిసన్ ఎక్స్పర్ట్, ఆర్థోపెడిక్ సర్జన్ మనన్ వోరా. అంతేకాదు ప్రొటీన్ కోసం ఏమేం తినాలో కూడా సూచిస్తున్నాడు.
గుడ్లు
వీటిలో ప్రొటీన్లతో పాటు శరీరానికి అవసరమైన 13 రకాల విటమిన్లు, లవణాలు ఉంటాయి. అంతేకాదు గుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. అందుకని గర్భిణులు రోజూ గుడ్డు తినాలి. దాంతో, ప్రొటీన్లు అందడమే కాకుండా పిండం కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
చిక్కుడు జాతి గింజలు
గర్భిణులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువ. గర్భిణులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే కడుపు ఉబ్బరం వంటి సమస్యలని వీటిలోని ఫైబర్ తగ్గిస్తుంది. అందుకని ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లు పప్పులు, బీన్స్, బఠాని, వేరుశనగ, సోయాబీన్ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
సీ ఫుడ్
బిడ్డ ఎదుగుదలకు, ఎర్రరక్తకణాల తయారీకి ఐరస్ చాలా అవసరం. చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ తింటే ఐరన్ అందుతుంది. వీటిలోని ఒమోగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. గర్భిణులకు రోజుకి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. సీ ఫుడ్ తరచూ తింటే రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.
పప్పులు
గర్భిణులు అన్నిరకాల పప్పులు తినాలి. దాంతో సరిపోను ప్రొటీన్, విటమిన్లు అందడమే కాకుండా బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ కొత్త కణాలు ఏర్పడడంలో సాయపడుతుంది.
అంతేకాదు పప్పులలోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

