వేసవిలో అత్యధికంగా దొరికే పండ్లలో కర్బూజా ఒకటి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో కర్బూజా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డైలీ కర్బూజా జూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలతో పాటు అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి.
➦ కర్బూజాలో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల గుండెకు న్యూట్రియంట్స్‌ను అందజేస్తుంది. అంతేకాకుండా ఫోలెట్ ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ నుంచి, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
➦ కర్బూజా జూస్ రెగ్యూలర్‌గా తాగడం వల్ల రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఈ పండుకు ఉంది.
➦ కర్బూజా పండులో విటమిన్ కె, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సరిగా జరిగేలా ఉపయోగపడుతుంది.
➦ కర్బూజాలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
➦ కర్బూజాలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. అంతేకాకుండా తెల్ల రక్తకణాలు వృద్ధి చెందేలా చేయడంతోపాటు రక్తంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.
➦ విటిమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సంబంధిత జబ్బులను తగ్గించడంలో కర్బూజా ముఖ్య పాత్ర పోషిస్తుంది.